cpdo
-
టీఎస్పీఎస్సీలో కొత్త కోణం.. ఆ పరీక్ష రద్దు చేయాలని ఆందోళన!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో పేపర్ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, కమిషన్ పరీక్షల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. సీపీడీవో అండ్ ఈవో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో, సీపీడీవో అండ్ ఈవో పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రొఫెసర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ స్పందించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేపర్ లీక్‌లో ఒక్కరే ఉన్నారని అనుకోవడం లేదు. పేపర్ లీక్‌పై రకరకాల వదంతులు వచ్చాయి. పరీక్షల రద్దుతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. మళ్లీ క్వాలిఫై అవుతామో లేదోనని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది జీవితాలలో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది. లీక్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణను లీకుల రాజ్యం, లిక్కర్ రాజ్యంగా మార్చారు. టీఎస్పీస్సీలో సమగ్ర పక్షాళన జరగాలి. డిమాండ్ల సాధన కోసం అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తాము. రాష్ట్రంలో అన్ని పార్టీలతో కలిసి త్వరలో పోరాటానికి పిలుపునిస్తామన్నారు. ఇక, పేపర్ లీక్‌పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. బీజేపీ నేతల తీరుపై అనుమానాలు: కేటీఆర్ -
దండుకో.. దోచుకో
సాక్షి, బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో కొందరు సీడీపీఓలు సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. వారిలో కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్‌గా నిలిచిన వైనంపై కథనం. జీతాలు పెరిగినప్పుడు, సమావేశాలకు, జనవరి ఫస్ట్ తదితరాలకు ఒక్కో అంగన్వాడీ కేంద్రం నుంచి రూ.1000 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదల్లేదు. నెలకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా కమీషన్లకు తమ కార్యాలయాలను అడ్డాగా మార్చుకుని సీడీపీఓలు కొనసాగుతున్నారు. నియోజకవర్గంలోని సీడీపీఓ టాప్‌మోస్ట్ కోవూరు నియోజకవర్గంలోని ఓ సీడీపీఓ టాప్‌మోస్ట్ అవినీతి పరురాలిగా సోషల్ మీడియాలో, ప్రజల్లో హల్చల్ జరుగుతోంది. సూపర్వైజర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని ఈమె చేస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రతి విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల వద్ద కూడా మామూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. తనకు రాష్ట్రస్థాయిలో పరపతి ఉందని, విచారణ జరిగినా ఎవరూ ఏమీ చేయలేరని బహిరంగంగా చెబుతున్నట్లు సమాచారం. బయటడినవి కొన్ని మాత్రమే.. వెంకటగిరి మండలంలో డక్కిలిలో అంగన్వాడీ సరుకులను నిల్వ ఉంచి, అవినీతికి పాల్పడటంతో అక్కడి సీడీపీఓ, సూపర్వైజర్ను గతంలో సస్పెండ్ చేశారు. కోవూరు నియోజకవర్గంలోని రెండు మండలాల్లో ఉన్న సీడీపీఓలు భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే అంగన్వాడీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనన్న భయంతో చెప్పరని ఆయా సీడీపీఓలు భావిస్తున్నారు. కలెక్టర్ ముత్యాలరాజు విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారు. సీడీపీఓల బండారంపై ఏసీబీకి ఫిర్యాదు కోవూరు నియోజకవర్గంలోని అవినీతి సీడీపీఓల భాగోతంపై కొందరు ఏసీబీకి లిఖిత పూర్వక సమాచారంతో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అక్రమ వసూళ్లు ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, ఉదయగిరి ప్రాజెక్ట్‌ల పరిధిలో పనిచేస్తున్న ముఖ్య అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందించడంలో శ్రద్ధచూపని అధికారులు మామూళ్ల వసూళ్లపై ఆసక్తి కనపరుస్తున్నారు. నియోజకవర్గంలో 446 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో సుమారు 900మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలకు సంబంధించి టీఏ, డీఏ బిల్లుల్లో, కేంద్రాల అద్దె బిల్లుల చెల్లింపుల్లో ట్రెజరీ పేరుతో పర్సంటేజీలు వసూలుచేస్తున్నారు. 2017లో ఉదయగిరిలో పనిచేసిన సీడీపీఓ అంగన్వాడీ కేంద్రాలకు పంపాల్సిన సరుకుల్లో అవకతవకలకు పాల్పడటంతో అప్పటి కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేశారు. ఉదయగిరి ప్రాజెక్ట్‌లో పనిచేసే ఓ సూపర్వైజర్ కార్యకర్తల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ప్రాజెక్ట్ పరిధిలో వేరే మండలంలో బదిలీ చేశారు. అక్కడ కూడా ఆమె వ్యవహార శైలిలో ఎలాంటిమార్పులు రాలేదనే ఆరోపణలున్నాయి. -
ఐసీడీఎస్‌లో వసూళ్ల దందా
నెల్లూరు (వేదాయపాళెం): అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఖాతాలలో బిల్లులు జమ కావడంతోనే వారివద్దనుంచి నిర్దేశిత పర్సంటేజీలలో కొందరు సీడీపీఓలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆయా సెక్టార్లలో అంగన్వాడీ కార్యకర్తలుగా పనిచేస్తూ సెక్టార్ల లీడర్లుగా కొనసాగేవారే తోటి అంగన్వాడీ కార్యకర్తల నుంచి బలవంతపు వసూళ్లు సాగిస్తూ కీలకంగా మారుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి వసూలు చేసిన పర్సంటేజీల నగదును గుట్టుచప్పుడు కాకుండా సూపర్వైజర్లకు అందజేస్తుంటారు. సూపర్వైజర్లు సీడీపీఓలకు చెల్లించాల్సిన స్థాయి మొత్తాన్ని గోప్యంగా వారికి చేరుస్తున్నారు. ఆయా ప్రాజెక్ట్‌ల పరిధిలో నెలవారీ మామూళ్లు రూ.లక్షలు సీడీపీఓలు, సూపర్వైజర్ల పరమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలున్నాయి. వసూళ్ల పరంపర ఇలా.. టీఏ బిల్లులలో 10 శాతం వసూలు చేస్తున్నారు. అదేమిటంటే ట్రెజరీలో మూడు శాతం సమర్పించుకోవాలని, మిగతాది వేరే ఖర్చులు అంటూ అక్రమ వసూళ్లను సమర్థించుకుంటున్నారు. గ్యాస్ బిల్లులు, అంగన్వాడీ కేంద్రం అద్దె బిల్లులు విషయంలో ఐదు శాతం వసూలు చేస్తున్నారు. ఇచ్చే నెల వారీ గ్యాస్ బిల్లులు అంతంత మాత్రంగా ఉండగా పర్సంటేజ్‌లు వసూలు చేస్తుండటంతో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లపై ఆర్థికభారం పడుతోంది. అలాగే అర్బన్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అధికంగా ఉన్నా రూ.3వేలు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. అద్దె బిల్లులు విషయంలో కూడా సూపర్వైజర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కోతలు విధిస్తున్నారు. నెల వారీ ఇంటి అద్దెలు సక్రమంగా పడకున్నప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలే ఇంటి యజమానులకు నచ్చజెప్పకోవడమో లేదా తామే ఆర్థిక భారాన్ని భరించటమో చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు పడినప్పడు తమ పర్సంటేజ్‌లు తమకు ఇవ్వాల్సిందేనంటూ బెదిరింపులకు పాల్పడటం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడ్లలోనూ కమీషన్లే.. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి అధికారులు నెలవారీ మామూళ్లకు పాల్పడుతున్నారు. నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ కమీషన్ దండుకుంటున్నారు. అక్రమ వసూళ్ల కారణంగా కోడిగుడ్ల సరఫరాలో లోపాలున్నప్పటికీ సీడీపీఓలు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కనీస గుడ్డు బరువు 50 గ్రాములు ఉండాల్సి ఉండగా తక్కువ బరువు కలిగిన గుడ్డులు సరఫరా చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలు కోడిగుడ్ల విషయం సూపర్వైజర్లు, సీడీపీఓలకు చెబుతున్నప్పటికీ పట్టించుకోవటంలేదు. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోవాలంటూ సూపర్వైజర్లు, సీడిపీఓలు అంగన్వాడీ కార్యకర్తలకు సర్దిచెబుతున్నారు. కమీషన్లే ఇందుకు కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశాల్లో బెదిరింపులు ప్రాజెక్ట్, సెక్టార్ మీటింగ్‌లలో పర్సంటేజీలు చెల్లించని అంగన్వాడీ కార్యకర్తలను సీడీపీఓలు, సూపర్వైజర్లు బెదరిస్తున్నారు. విధి నిర్వహణలో రికార్డులన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ సమావేశంలో నిలబెట్టి దూషిస్తున్నారు. పర్సంటేజీలు ఇవ్వకపోవడమే ఇందకు కారణమని సమాచారం. జిల్లా అధికారులు దృష్టి సారించి ఐసీడీఎస్‌లో ఉన్న అవినీతిని ప్రక్షాలన చేయాల్సిన అవసరం ఉంది. ట్రెజరీలో పర్సంటేజీల మోత ప్రతిబిల్లు విషయంలో జిల్లాలోని 17 ప్రాజెక్ట్‌లలో అంగన్వాడీ కార్యకర్తల నుంచి పర్సంటేజీలు వసూలు చేస్తున్న మాట వాస్తవమే. టీఏ బిల్లులు, గ్యాస్, ఇంటి అద్దె బిల్లులు విషయంలో సీడీపీఓలు బలవంత వసూళ్లకు పాల్పడుతున్నారు. –వై.సుజాతమ్మ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఫిర్యాదు చేస్తే చర్చలు తీసుకుంటాం ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లలో బిల్లుల చెల్లింపుల విషయంలో ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు ఈ విషయంలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకుని వస్తే పరిస్థితిని చక్కదిద్దుతాం. –పి.ప్రశాంతి, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ -
తహశీల్దార్ x సీడీపీఓ
మహబూబ్‌నగర్(నవాబుపేట): ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతివిమర్శలు సంధించారు. ఒకరికొకరు సూచనలు చేశారు. మీరు పనితీరు మార్చుకోవాలని సూచిస్తే.. మీరే మార్చుకుని నడుచుకోవాలని మరొకరు..! ఇలా తహశీల్దార్, సీడీపీఓల మధ్య మాటలయుద్ధం సాగింది. ఇందుకు మంగళవారం మండలంలోని కారూర్లో జరిగిన పల్లెవికాసం కార్యక్రమం వేదికైంది. మొదట తహశీల్దార్ చెన్నకిష్టప్ప స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. పౌష్టికాహారం పక్కదారిపడుతోందని, మీపై ఫిర్యాదులు వస్తున్నాయని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని సీడీపీఓ బాలమణిని హెచ్చరించారు. దీంతో స్పందించిన ఆమె.. మీరూ ఓ ప్రభుత్వ అధికారే కదా! కిందిస్థాయిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. అందరిశాఖల్లో లొసుగులు మామూలే కదా అని బదులిచ్చారు. ఇద్దరి మధ్య నడిచిన ఈ తతంగాన్ని అక్కడే ఉన్న మిగతా అధికారులు, గ్రామస్తులంతా చూస్తుండి పోయారు. -
అసభ్యపదజాలంతో దూషించారు
అంగన్వాడీ కార్యకర్త తీరుపై సీడీపీవో ఆవేదన పీలేరు: అంగన్వాడీ కార్యకర్త తన పట్ల దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించారని చిన్నగొట్టిగల్లు సీడీపీవో వసంతభాయి విలపించారు. బుధవారం పీలేరు ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీడీపీవో కథనం మేరకు.. బుధవారం పీలేరు పట్టణం అజంతా టాకీస్ సమీపంలోని అంగన్వాడీ కేంద్రాన్ని అసిస్టెంట్ సీడీపీవోతో కలసి ఆకస్మికంగా తనిఖీ చేశా. అంగన్వాడీ కార్యకర్త చిన్నమ్మ కేంద్రంలో ఉన్నారు.రోజువారి ఫ్రీస్కూల్ పిల్లల హాజరు రిజిస్టర్లో 13 మంది వచ్చినట్లు నమోదు చేశారు. తాము కేంద్రాన్ని తనిఖీ చేసినపుడు ఏడుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. స్టాక్ వివరాలు తెలియజేసే రిజిస్టర్ లేదు. మరోవైపు బియ్యం, పప్పు, నూనె అంగన్వాడీ కేంద్రలో లేవు. కోడిగుడ్లు సైతం తక్కువగా ఉన్నాయి. అమృతహస్తం రిజిస్టర్లో 16 మంది పేర్లు ఉండగా అందులో కొందరి పేర్లవద్ద ఈ నెలాఖరు వరకు సంతకాలు చేసి ఉండడం కనిపించింది. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే కార్యకర్త సమాధానం దాటవేశారు. అసభ్యపదజాలంతో నన్ను దూషించారు’ అని సీడీపీవో విలపించారు. జరిగిన సంఘటనపై జిల్లా -
ముళ్లపొదల్లో చిన్నారి
నంద్యాల టౌన్ : తల్లిదండ్రులు చెత్తకుప్ప పాలు చేసిన ఓ చిన్నారిని మానవతామూర్తి అక్కున చేర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ పాపను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు రోజుల తర్వాత ఆమెను కర్నూలులోని శిశువిహార్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇస్మాయిల్, అధికారులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఆడ పిల్ల అనో.. మరే ఇతర కారణాలతోనో మూడు రోజుల వయస్సు చిన్నారిని కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో బొమ్మలసత్రం వద్దనున్న కుందూ నది ఒడ్డున ముళ్లకంప మధ్య వదిలేశారు. బహిర్భూమికి వెళ్లిన మూలసాగరం వాసి ఇస్మాయిల్ చిన్నారి ఏడుపు వినిపిస్తుండటంతో అటువైపుగా వెళ్లి అక్కున చేర్చుకున్నాడు. ఆ సమయంలో కుక్కలు గుమికూడి ఉండటంతో వాటిని తరిమేశాడు. పాపను ఇంటికి తీసుకెళ్లగా కుటుంబ సభ్యులు స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగించి అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత విషయాన్ని అంగన్వాడీ కార్యకర్త సుశీలకు తెలియజేశారు. ఆమె సమాచారంతో ఐసీడీఎస్ అర్బన్ సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ అక్కడికి చేరుకున్నారు. అయితే కొన్ని గంటల పాటు తమ వద్దే ఉంచుకున్న ఇస్మాయిల్ కుటుంబం పాపను విడిచిపెట్టలేక దత్తత తీసుకుంటామని సీడీపీఓను కోరగా అందుకామె నిరాకరించారు. దీంతో వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. విధిలేని పరిస్థితుల్లో సీడీపీఓ.. త్రీటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ దైవప్రసాద్‌కు ఫిర్యాదు చేసి పోలీసుల సహాయంతో చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాపకు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా వైద్యురాలు లలిత పరీక్షించారు. నెలలు నిండక మునుపే జన్మించడంతో బరువు తక్కువగా ఉందని.. ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి కర్నూలులోని శిశువిహార్‌కు తరలిస్తామని సీడీపీఓ వెల్లడించారు. తల్లిదండ్రులకు పిల్లలు భారమైతే ఇలా పారేయకుండా సమీపంలోని అంగన్వాడీ కేంద్రాల్లో అప్పగించాలని.. వివరాలను సైతం గోప్యంగా ఉంచుతామన్నారు. చిన్నారిని కాపాడిన ఇస్మాయిల్‌ను ఆమె అభినందించారు. -
సీడీపీవోపై వేటు..
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : విధుల్లో నిర్లక్ష్యం.. నిధుల్లో గోల్‌మాల్‌కు పాల్పడిన ఐసీడీఎస్ ఆదిలాబా ద్ రూరల్ సీడీపీవో ప్రభావతిపై ఎట్టకేలకు వేటు పడింది. ‘ఐసీడీఎస్‌లో నిధు ల స్వాహా’ శీర్షికన అక్టోబర్ 27న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆమెను జిల్లా నుంచి బదిలీ చేయాలని, క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్, మహిళ శిశు సంక్షేమ శాఖ చైర్మన్ అహ్మద్‌బాబు హైదరాబాద్‌లోని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌కు శనివారం సిఫార్సు చేశారు. సీడీపీవోపై ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ ఆమెను సస్పెండ్ చేస్తారని శాఖ ఉద్యోగులు భావించినా జిల్లా నుంచి బదిలీతో సరిపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. కలెక్టర్ చర్యపై ఐసీడీఎస్‌లో హర్షం వ్యక్తమవుతోంది. సీడీపీవోతో పాటు ఇద్దరు అటెండర్లపైనా వేటు పడింది. బదిలీలపై ఆంక్షలు ఉండడంతో వారిని జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు డెప్యుటేషన్‌పై పంపారు. వేటు తప్పదేమో..? సీడీపీవో ప్రభావతి ఆదిలాబాద్ రూరల్‌తోపాటు ముథోల్ ఇన్చార్జి సీడీపీవో వ్యవహరిస్తున్నారు. గతంలో సూపర్వైజర్గా ఇక్కడే పనిచేశారు. పదోన్నతిపై సీడీపీవోగా బోథ్ ప్రాజెక్టులో కొద్ది కాలమే పనిచేసి తిరిగి ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టుకు బదిలీ చేయించుకున్నారు. ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. సీడీపీవోనే ప్రాజెక్టుకు సంబంధించి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆ అకౌంట్లో జమ అయిన డబ్బులను వారం రోజుల్లో ఖర్చు చేయాలి. ఉద్యోగుల వేతనాలు, అంగన్వాడీల ఖర్చు డబ్బులు వెంటనే ఇచ్చేసి డీడీలు, చెక్ రూపంలో చెల్లించాల్సినవైతే నెలరోజుల వరకు సమయం తీసుకోవచ్చు. అంతకుమించి అకౌం ట్లో డబ్బులుంటే వాటిని వెంటనే సంబంధిత శాఖ ఉన్నతాధికారికి అప్పజెప్పాలి. అయితే.. రూరల్ సీడీపీవో మార్చిలో అకౌంట్లోకి వచ్చిన రూ.లక్షల నిధులను ఖర్చు చేయకుండా అంటిపెట్టుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అదే కార్యాలయంలో యూడీసీగా పనిచేస్తున్న రాణి సీడీపీవో వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. తాను పీడీ కార్యాలయం నుంచి ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టుకు యూడీసీగా బదిలీపై వచ్చినా తనకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పజెప్పకుండా కొన్ని రిజిస్టర్లు, సర్వీసు బుక్ మాత్రమే ఇచ్చారని, రూ.58.71 లక్షల పేమెంట్ కాని నిధులు ఖాతా లో ఉన్నాయని సీడీపీవోపై యూడీసీ ఫిర్యాదు చేశారు. రూ.10 లక్షలకు సంబంధించిన చెక్కు లు కూడా బ్యాంకులో బౌన్స్ అయినట్లు ఆరోపించారు. ఈ నిధులు ఎక్కడివి, దానికి సంబంధించిన రికార్డులు ఏవి అన్న విషయంలో స్పష్ట త లేదని ఆమె ఏజేసీగా ఉన్న వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. అంగన్వాడీలకు సంబంధించి భవనాల అద్దె, అంగన్వాడీలు, ఆయాల టీఏ, అమృతహస్తం, అంగన్వాడీలకు అదనపు గౌర వ వేతనం, వంట చెరుకు, వీవో బిల్స్ తదితర వాటికి సంబంధించిన నిధులనే సీడీపీవో అంగన్వాడీలకు ఇవ్వకుండా కాజేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఏజేసీ వెంకటయ్య సీడీపీవో కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను సీజ్ చేశారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణకు సంబంధించి ఐసీడీఎస్ పీడీ కార్యాలయం నుంచి నివేదిక పం పించడంలో తాత్సారం చేయడంతో దాదాపు నెల రోజుల తరువాత ఆమెపై చర్యలు తీసుకున్నారు. అన్డిస్బర్స్, క్యాష్బుక్ రిజిష్టర్లు సరిగ్గా లేవని, స్టాక్ వివరాలు కూడా సరిగా లేనందున ఆమెపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిఫారసు చేశారు. కాగా.. కలెక్టర్ సిఫారసు నేపథ్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొదట చార్జ్‌మెమో జారీ చేసే అవకాశాలు లేకపోలేదు. దానికి సీడీపీవో ఇచ్చే జవాబు సంతృప్తిగా లేనిపక్షంలో శాఖపరంగా విచారణ అధికారిని నియమిస్తారు. ఇదిలా ఉంటే సీడీపీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేటర్లుగా ఉన్న కీర్తిపాల్, రాములపై కూడా వేటుపడింది. అయితే వారికి స్థానభ్రంశం కల్పించారు. కీర్తిపాల్ను నిర్మల్‌కు, రామును ముథోల్‌కు డెప్యుటేషన్ వేశారు. విచారణలో నిధుల దుర్వినియోగం తేలితే సీడీపీవోను సస్పెండ్ చేసే అవకాశమూ లేకపోలేదు.