ఫ్లోరిడాలోని ఒక మాజీ ఇండో-అమెరికన్ ఇంజనీర్ స్పేస్ ఎక్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇతర ఉద్యోగులతో పోలిస్తే శిక్షణ, పని విషయంలో సంస్థ తన పట్ల జాతి వివక్ష ప్రదర్శించినట్లు భారతీయ-అమెరికన్ అజయ్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో ఓర్లాండోలోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎలోన్ మస్క్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌కు వ్యతిరేకంగా రెడ్డి దావా వేశారు. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం(నవంబర్ 9) సంస్థకు సమన్లు జారీ చేసింది. స్పేస్ ఎక్స్ జాతి వివక్ష, జాతీయ మూల వివక్ష, ప్రతీకారం & ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆరోపించింది.
ఈ వ్యాజ్యంలో తనను తాను భారతీయ సంతతికి చెందిన ఆసియా-అమెరికన్ వ్యక్తిగా పేర్కొన్న అజయ్ రెడ్డి 2020 మేలో ఫెయిర్ రికవరీ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలిగించినట్లు ఆరోపించారు. జూన్ 2020లో యుఎస్ ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ కమిషన్(ఈఈఓసీ), ఫ్లోరిడా కమిషన్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ కు ఈ విషయం గురుంచి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈఈఓసీకి స్పేస్ ఎక్స్ ఇచ్చిన పొజిషన్ స్టేట్ మెంట్ ప్రకారం.. స్పేస్ ఎక్స్ మేనేజర్ రాబర్ట్ హిల్ అజయ్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒక సమావేశంలో రాబర్ట్ హిల్ వేసిన ప్రశ్నలకు సమాధానాలకు ప్రతిస్పందనగా రెడ్డి అసభ్యకరంగా ముఖ కవళికలు చేయడంతో తన ఉద్యోగాన్ని రద్దు చేసినట్లు హిల్ తెలిపారు.
(చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?)
"స్పేస్ ఎక్స్ సంస్థలో ఉన్న కాలమంతా తను తీవ్రమైన వేధింపులకు గురి అయినట్లు, ఎగతాళి చేసినట్లు, బెదిరించినట్లు, పనితీరు గురించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు" రెడ్డి వ్యాజ్యంలో తెలిపారు. వీటి గురుంచి రెడ్డి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు స్పేస్ ఎక్స్ స్పందించలేదు. అజయ్ రెడ్డి సంస్థలో ఇద్దరు తెల్ల ఇంజనీర్లతో కలిసి పనిచేశాడు. వారు ఫెయిర్యింగ్ రికవరీ ఉద్యోగం కోసం అతని కంటే ముందు సెలెక్ట్ అయ్యారు. ఈ ముగ్గరు ఇతర ఉద్యోగులతో కలిసి స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు సముద్రంలో పడినప్పుడు రాకెట్ల శకలాలను తిరిగి తీసుకొని రావాలి. ఈ కార్యక్రమం కొత్తది కావడం వల్ల మొదట ఎవరికి శిక్షణ ఇవ్వలేదు. కానీ, తర్వాత అతని సహచరులలో ఒకరికి కాలిఫోర్నియాలో అనేక రోజుల శిక్షణ ఇచ్చారు, మరొకరికి ఈ వ్యవస్థను రూపొందించిన ఇంజనీర్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పించినట్లు రెడ్డి ఆరోపించారు. ఈ శిక్షణ శిక్షణ గురుంచి రెడ్డి అడిగినప్పుడు వారు నిరాకరించినట్లు తెలిపాడు. దీంతో రెడ్డి "ఆ విషయన్ని తను అవమానంగా భావించినట్లు, ఒ౦టరిగా ఉన్నట్లు భావించాడని" దావాలో పేర్కొన్నాడు.
ఈ వ్యాజ్యంలో పేర్కొన్న తన ఇద్దరు సహచరులు చాలా తప్పులు చేశారని, దానివల్ల సంస్థ మిలియన్ల డాలర్ల నష్టం వచ్చినట్లు రెడ్డి ఆరోపించారు. కానీ వారిని శిక్షించలేదని పేర్కొన్నాడు. చేయని తప్పులకు తనను శిక్షించారని రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని సహోద్యోగుల పనితీరు ఎలా ఉన్న వారిని సంస్థ ఏమి అనేది కాదని, తనను మాత్రం తప్పు లేకున్నా శిక్షించినట్లు తెలిపాడు. స్పేస్ ఎక్స్ తనపట్ల వివక్ష చూపిందని రెడ్డి ఆరోపించారు. అదే విధంగా ఆసియాయేతర ఇంజనీర్ల మాదిరిగానే తనకు ఉద్యోగ విధులను నిర్వహించడానికి చాలా తక్కువగా ప్యాకేజీని చెల్లించినట్లు పేర్కొన్నాడు. స్పేస్ ఎక్స్ సంస్థ వల్ల అతను "ఆర్ధికంగా నష్ట పోయినట్లు, మానసిక బాధపడినట్లు, తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడికి గురి అయినట్లు" దావాలో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన తీసుకోవాలని, న్యాయ నిపుణుల ఫీజుల ఖర్చులను, తనకు న్యాయం చేయాలని అజయ్ రెడ్డి కోర్టును కోరారు.
(చదవండి: ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?)
Comments
Please login to add a commentAdd a comment