indo-americans
-
ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేసిన ఇండో-అమెరికన్
ఫ్లోరిడాలోని ఒక మాజీ ఇండో-అమెరికన్ ఇంజనీర్ స్పేస్ ఎక్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఇతర ఉద్యోగులతో పోలిస్తే శిక్షణ, పని విషయంలో సంస్థ తన పట్ల జాతి వివక్ష ప్రదర్శించినట్లు భారతీయ-అమెరికన్ అజయ్ రెడ్డి ఆరోపించారు. ఈ నెల ప్రారంభంలో ఓర్లాండోలోని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎలోన్ మస్క్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్‌కు వ్యతిరేకంగా రెడ్డి దావా వేశారు. ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు మంగళవారం(నవంబర్ 9) సంస్థకు సమన్లు జారీ చేసింది. స్పేస్ ఎక్స్ జాతి వివక్ష, జాతీయ మూల వివక్ష, ప్రతీకారం & ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టు ఆరోపించింది. ఈ వ్యాజ్యంలో తనను తాను భారతీయ సంతతికి చెందిన ఆసియా-అమెరికన్ వ్యక్తిగా పేర్కొన్న అజయ్ రెడ్డి 2020 మేలో ఫెయిర్ రికవరీ ఇంజనీర్ ఉద్యోగం నుంచి తొలిగించినట్లు ఆరోపించారు. జూన్ 2020లో యుఎస్ ఈక్వల్ ఎంప్లాయిమెంట్ ఆపర్చునిటీ కమిషన్(ఈఈఓసీ), ఫ్లోరిడా కమిషన్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్ కు ఈ విషయం గురుంచి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈఈఓసీకి స్పేస్ ఎక్స్ ఇచ్చిన పొజిషన్ స్టేట్ మెంట్ ప్రకారం.. స్పేస్ ఎక్స్ మేనేజర్ రాబర్ట్ హిల్ అజయ్ రెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఒక సమావేశంలో రాబర్ట్ హిల్ వేసిన ప్రశ్నలకు సమాధానాలకు ప్రతిస్పందనగా రెడ్డి అసభ్యకరంగా ముఖ కవళికలు చేయడంతో తన ఉద్యోగాన్ని రద్దు చేసినట్లు హిల్ తెలిపారు. (చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?) "స్పేస్ ఎక్స్ సంస్థలో ఉన్న కాలమంతా తను తీవ్రమైన వేధింపులకు గురి అయినట్లు, ఎగతాళి చేసినట్లు, బెదిరించినట్లు, పనితీరు గురించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు" రెడ్డి వ్యాజ్యంలో తెలిపారు. వీటి గురుంచి రెడ్డి న్యాయవాది అడిగిన ప్రశ్నలకు స్పేస్ ఎక్స్ స్పందించలేదు. అజయ్ రెడ్డి సంస్థలో ఇద్దరు తెల్ల ఇంజనీర్లతో కలిసి పనిచేశాడు. వారు ఫెయిర్యింగ్ రికవరీ ఉద్యోగం కోసం అతని కంటే ముందు సెలెక్ట్ అయ్యారు. ఈ ముగ్గరు ఇతర ఉద్యోగులతో కలిసి స్పేస్ ఎక్స్ ఉపగ్రహాలు సముద్రంలో పడినప్పుడు రాకెట్ల శకలాలను తిరిగి తీసుకొని రావాలి. ఈ కార్యక్రమం కొత్తది కావడం వల్ల మొదట ఎవరికి శిక్షణ ఇవ్వలేదు. కానీ, తర్వాత అతని సహచరులలో ఒకరికి కాలిఫోర్నియాలో అనేక రోజుల శిక్షణ ఇచ్చారు, మరొకరికి ఈ వ్యవస్థను రూపొందించిన ఇంజనీర్లతో కలిసి పనిచేసే అవకాశం కల్పించినట్లు రెడ్డి ఆరోపించారు. ఈ శిక్షణ శిక్షణ గురుంచి రెడ్డి అడిగినప్పుడు వారు నిరాకరించినట్లు తెలిపాడు. దీంతో రెడ్డి "ఆ విషయన్ని తను అవమానంగా భావించినట్లు, ఒ౦టరిగా ఉన్నట్లు భావించాడని" దావాలో పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యంలో పేర్కొన్న తన ఇద్దరు సహచరులు చాలా తప్పులు చేశారని, దానివల్ల సంస్థ మిలియన్ల డాలర్ల నష్టం వచ్చినట్లు రెడ్డి ఆరోపించారు. కానీ వారిని శిక్షించలేదని పేర్కొన్నాడు. చేయని తప్పులకు తనను శిక్షించారని రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని సహోద్యోగుల పనితీరు ఎలా ఉన్న వారిని సంస్థ ఏమి అనేది కాదని, తనను మాత్రం తప్పు లేకున్నా శిక్షించినట్లు తెలిపాడు. స్పేస్ ఎక్స్ తనపట్ల వివక్ష చూపిందని రెడ్డి ఆరోపించారు. అదే విధంగా ఆసియాయేతర ఇంజనీర్ల మాదిరిగానే తనకు ఉద్యోగ విధులను నిర్వహించడానికి చాలా తక్కువగా ప్యాకేజీని చెల్లించినట్లు పేర్కొన్నాడు. స్పేస్ ఎక్స్ సంస్థ వల్ల అతను "ఆర్ధికంగా నష్ట పోయినట్లు, మానసిక బాధపడినట్లు, తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడికి గురి అయినట్లు" దావాలో పేర్కొన్నాడు. వారిపై చట్టపరమైన తీసుకోవాలని, న్యాయ నిపుణుల ఫీజుల ఖర్చులను, తనకు న్యాయం చేయాలని అజయ్ రెడ్డి కోర్టును కోరారు. (చదవండి: ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?) -
బైడెన్ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వారిలో మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నామినేట్ అయిన నీరా టాండన్ ఒకరు. బైడెన్ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్ మూలాలున్న కమలా హ్యారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. జనవరి 20న దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ యంత్రాంగంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న ఇండో అమెరికన్లలో.. యూఎస్ సర్జన్ జనరల్‌గా ఎంపికైన వివేక్ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపికైన వనిత గుప్తా, సివిలియన్ సెక్యూరిటీ, డెమొక్రసీ, హ్యూమన్‌రైట్స్‌కు అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎంపికైన ఉజ్రా జెయా, బైడెన్ భార్య, కాబోయే ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ఎంపికైన మాలా అడిగ, జిల్ బైడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా ఎంపికైన గరీమా వర్మ, వైట్ హౌజ్ డెప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్‌హౌజ్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన భరత్ రామమూర్తి, వైట్‌హౌజ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన గౌతమ్ రాఘవన్ తదితరులున్నారు. కశ్మీరీ మూలాలున్న అయిషా షా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటెజీలో పార్ట్నర్షిప్ మేనేజర్‌గా, సమీరా ఫజిలి వైట్‌హౌజ్‌లోని యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్లో డెప్యూటీ డైరెక్టర్‌గా ఎంపిక కావడం విశేషం. మరోవైపు, జో బైడెన్ సన్నిహిత బృందంలో ఒకరైన వినయ్ రెడ్డి డైరెక్టర్, స్పీచ్ రైటింగ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌గా యువకుడైన వేదాంత్ పటేల్‌ను ఎంపిక చేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ ఛాబ్రా, సీనియర్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఏసియాగా సుమొన గుహ, కోఆర్డినేటర్ ఫర్ డెమొక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్‌గా శాంతి కళాతిల్లను బైడెన్ ఎంపిక చేశారు. క్లైమేట్ పాలసీ అండ్ ఇన్నోవేషన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్, వైట్‌హౌజ్ కోవిడ్–19 రెస్పాన్స్ టీమ్‌కి పాలసీ అడ్వైజర్ ఫర్ టెస్టింగ్‌గా విదుర్ శర్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌజ్ న్యాయవిభాగంలో అసోసియేట్ కౌన్సెల్‌గా నేహ గుప్తా, డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా రీమా షా ఇండో అమెరికన్ మహిళల శక్తిసామర్థ్యాలను చూపనున్నారు. కోలం ముగ్గులు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్, కమల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రారంభ సూచికగా శనివారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో భారత్‌లోని తమిళనాడుకు చెందిన సంప్రదాయ కోలం ముగ్గులు ఆకట్టుకున్నాయి. బైడెన్, కమలలను ఆహ్వానిస్తూ వేలాది కోలం డ్రాయింగ్స్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్, ఇండియా నుంచి 1,800 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సౌభాగ్యాలను ఆహ్వానిస్తూ తమిళనాడులోని గృహిణులు తమ ఇళ్లల్లో, ఇళ్ల ముందు వీటిని వేస్తారు. కమల తల్లి శ్యామల తల్లి స్వస్థలం తమిళనాడేనన్న విషయం తెలిసిందే. తొలి రోజు సుమారు డజను నిర్ణయాలు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు బైడెన్ సుమారు డజను అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వాటిలో అమెరికా ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సంక్షోభాలు.. కోవిడ్, ఆర్థిక రంగ మందగమనం, వాతావరణ మార్పు, జాత్యహంకారం.. వీటి నివారణలపై చర్యలు చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారని వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాన్ క్లెయిన్ వెల్లడించారు. అమెరికన్ విద్యార్థుల రుణాల చెల్లింపుల గడువు పొడిగింపు, పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరడం, ముస్లింలపై నిషేధాన్ని తొలగించడం.. తదితర అంశాలపై తొలి పది రోజుల్లో నిర్ణయాలుంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల వలసదారులకు లీగల్ స్టేటస్ కల్పించే విషయానికి బైడెన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యుల్లోనూ అంతర్గతంగా విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో.. ఎప్పుడు బైడెన్ దీన్ని అమలు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే బైడెన్ సంబంధిత ఇమిగ్రేషన్ బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తారని రాన్ క్లెయిన్ స్పష్టం చేశారు. కమలా హ్యారిస్ ప్రమాణం తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి దక్షిణాసియా మూలాలున్న ఉపాధ్యక్షురాలు, తొలి బ్లాక్ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్న కమలా హ్యారిస్‌తో జనవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. జస్టిస్ సోనియా కూడా యూఎస్ సుప్రీంకోర్టులో తొలి హిస్పానిక్ న్యాయమూర్తి, మూడో మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. గతంలో జస్టిస్ సోనియా న్యూయార్క్‌లో, కమలా హ్యారిస్ కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో కమల రెండు బైబిల్స్‌ను చేతిలో పట్టుకుని ప్రమాణం చేస్తారు. ఆ రెండు బైబిల్స్లో.. ఒకటి తన తల్లిలాంటి రెజీనా షెల్టన్‌ది కాగా, మరొకటి అమెరికా మానవ హక్కుల నేత, సుప్రీంకోర్టు తొలి ఆఫ్రో అమెరికన్ న్యాయమూర్తి తర్గుడ్ మార్షల్‌ది కావడం విశేషం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్కూల్ ముగియగానే.. కమల తన సోదరి మాయతో కలిసి తమ ఇంటికి రెండు ఇళ్ల దూరంలో ఉన్న రెజీనా ఇంటికే వెళ్లేవారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, తరువాత సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రెజీనా షెల్టన్ బైబిల్నే కమలా హ్యారిస్ తీసుకువెళ్లారు. వినయ్ రెడ్డి, వనితా గుప్తా, సబ్రినా సింగ్, భరత్ రామ్మూర్తి, సమీరా ఫజిలి వివేక్‌మూర్తి, మాలా అడిగ, నీరా టాండన్, గౌతమ్ రాఘవన్, వేదాంత్ పటేల్ -
నేను సూపర్ మ్యాన్‌ను: ట్రంప్
వాషింగ్టన్: కరోనా వైరస్ చికిత్స తీసుకున్నాక తనకి తానే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆ చికిత్సతో రోగ నిరోధక శక్తి పెరిగి తనలో శక్తి బాగా పుంజుకుందని అన్నారు. కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయన పెన్సిల్వేనియా ఎన్నికల సభలో తన మద్దతుదారులనుద్దేశించి మాట్లాడారు. తనకు చికిత్స అందించిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘కరోనా సోకిన తర్వాత నాకు ఇచ్చిన మందులు అద్భుతంగా పని చేశాయి. అవేవో యాంటీ బాడీస్ చికిత్స అనుకుంటాను. నాకు సరిగ్గా తెలీదు. అది తీసుకున్నాక నా ఆరోగ్యం చాలా మెరుగుపడింది. నాకు నేనే ఒక సూపర్ మ్యాన్‌లా అనిపిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యులు అమెరికాలో వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో ఉన్నారని ఆయన కొనియాడారు. తనకు ఎంతటి శక్తి వచ్చిందంటే ఈ సభలో ఉన్న అందరినీ ముద్దాడగలనని అంటూ చమత్కరించారు. ట్రంప్ క్వారంటైన్ సమయం ముగియ కుండానే బయటకి వచ్చారన్న విమర్శలకి ఆయన బదులిస్తూ ‘‘కావాలంటే నేను కూడా వైట్‌హౌస్‌లో ఒక మూల గదిలో కూర్చోవచ్చు. కానీ నేను అలా చెయ్యలేను. ఎందుకంటే నేను ఈ దేశానికి అధ్యక్షుడిని. నేను ప్రజల్ని కలుసుకోవాలి. వారితో మాట్లాడాలి. అందుకే నేను అలా శ్వేత సౌధానికే పరిమితమవలేకపోయాను’’ అని ఆ ఎన్నికల సభలో ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ కంటే ట్రంప్ బాగా వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతూ ఉండడంతో ట్రంప్ ప్రచారాన్ని ఉధృతంగా నిర్వహిస్తున్నారు. బైడెన్‌కే ఇండో అమెరికన్లు జై తాజా సర్వేలో మళ్లీ వెల్లడి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే భారతీయ అమెరికన్లు జై కొడుతున్నారని తాజా సర్వేలో మరోసారి వెల్లడైంది. ఇండో అమెరికన్ ఓటర్లలో 72శాతం మంది బైడెన్‌కి ఓటు వేయాలని భావిస్తుంటే, 22శాతం మంది అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కి మద్దతుగా ఉన్నట్టుగా ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (ఐఏఏఎస్)లో తేలింది. మరో మూడు శాతం మంది వేరే అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తే, మరో మూడు శాతం మంది ఓటు వెయ్యడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ఆ సర్వే వెల్లడించింది. ఇండియన్ అమెరికన్లు ఎప్పటి నుంచో డెమొక్రాట్లకే మద్దతుగా ఉన్నారు. ఈ సారి భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఉండడం, విదేశీ విధానంపై ట్రంప్ అనుసరిస్తున్న ఆందోళనలు వంటివి కూడా ప్రవాస భారతీయులు ఎక్కువగా జో బైడెన్ వైపు మొగ్గు చూపించడానికి దోహదం చేశాయని ఆ సర్వే వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి 20 వరకు ఆన్లైన్ ద్వారా 936 మంది ఇండో అమెరికన్లతో ఈ సర్వే నిర్వహించింది. -
జాతి వివక్ష అంతమే లక్ష్యం
వాషింగ్టన్/బెర్లిన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ పోలీసుల దౌర్జన్యానికి బలి కావడంతో ఆగ్రహంతో ప్రారంభమైన ప్రదర్శనలు ఇప్పుడు జాతి వివక్ష అంతమే లక్ష్యంగా కొనసాగుతున్నాయి. అమెరికాలో ఫ్లాయిడ్ పుట్టిన ప్రాంతం నార్త్ కరొలినాలో కుటుంబ సభ్యులు రెండో సంస్మరణ సభ నిర్వహించారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ 1963లో చేసిన పేరుపొందిన ప్రసంగం ‘ఐ హేవ్ ఏ డ్రీం’ను పురస్కరించుకుని వాషింగ్టన్లో వచ్చే ఆగస్టులో స్మారక ర్యాలీ నిర్వహించనున్నట్లు రెవరెండ్ అల్ షార్ప్టన్ చెప్పారు. ‘అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మొత్తం న్యాయ వ్యవస్థ మారాలంటూ ప్రజా ఉద్యమానికి ఊపిరి పోస్తాం. అలా చేయకుంటే మరో ఏడాది గడిచిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. ఎవరూ పట్టించుకోరు’అని ఓ ఇంటర్వ్యూలో నల్ల జాతీయులనుద్దేశించి పేర్కొన్నారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా.. ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. జాతి వివక్షను ఇక సహించబోమంటూ నిరసనకారులు గొంతెత్తి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియాలో కస్టడీ మరణాలకు వ్యతిరేకంగా సిడ్నీలో భారీ ప్రదర్శనలు జరిగాయి. ‘కరోనా వైరస్‌తో మరణించకపోతే, పోలీసులు క్రూరత్వానికి మేము బలైపోతాం’అన్న నినాదాలు హోరెత్తిపోయాయి. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో వరసగా రెండో రోజు కూడా ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల మాస్కులు, టీ షర్టులు ధరించిన వారంతా బ్లాక్స్‌కి కొరియన్స్ మద్దతు ఉంటుందని అంటూ నినదించారు. జపాన్ రాజధాని టోక్యోలో వందలాది మంది శాంతియుత నిరసనలు చేశారు. మేమూ మారాలి: ఇండో అమెరికన్ అడ్వొకసీ గ్రూప్ జార్జ్ ఫ్లాయిడ్, ఇతర ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలతో అగ్రరాజ్యంలో నల్లజాతీయులపై కొనసాగుతున్న వివక్ష ఎంత భయానకంగా ఉంటుందో ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చిందని ఇండియన్ అమెరికన్ న్యాయవాదుల గ్రూప్ తెలిపింది. ఇలాంటి సమయంలోనూ భారత్, ఇతర దక్షిణాసియా దేశాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది మౌనంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉంటారని, ఈ ధోరణి మారాలని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండియన్ అమెరిన్లను రాజకీయాల్లోకి చేర్చేందుకు సహకరించే ఈ సంస్థ మైనార్టీల దారుణ మరణాలపై తీవ్రంగా స్పందించింది. ‘కచ్చితంగా చెప్పాలంటే మేమేమీ నిరపరాధులం కాదు’అని ఆ ప్రకటనలో పేర్కొంది. ‘నల్లజాతీయులు, ఇతర పౌర హక్కులు అమెరికా ఇమిగ్రేషన్ కోసం నిరంతర పోరాటం చేయడం వల్ల మేము ఇప్పడు ఈ దేశంలో ఉన్నాం. వారు చేసిన కృషి ఫలితాలను అనుభవిస్తున్నాం. అయినప్పటికీ జాతి వివక్షకి సంబంధించిన దారుణాలు వెలుగులోకి వచ్చినప్పుడు భారతీయులు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. అది మారాలి’అని ఆ ప్రకటన వివరించింది. బెర్లిన్‌లో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న యువతి -
ముగ్గురు ఇండో–అమెరికన్లు దోషులే
న్యూయార్క్: అమెరికాలో మాదకద్రవ్యాల వ్యాపారం ఆధారంగా అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డ కేసులో ముగ్గురు ఇండో–అమెరికన్లు సహా ఆరుగురు దోషులుగా తేలినట్లు యూఎస్ న్యాయశాఖ తెలిపింది. టెక్సాస్‌లోని లారెడోకు చెందిన రవీందర్ రెడ్డి గుడిపాటి(61), హర్‡్ష జగ్గీ(54), నీరూ జగ్గీ(51)తో పాటు ఆండ్రియన్ హెర్నాండేజ్(మెక్సికో), గాల్వన్ కాన్‌స్టాంటీనీ, లూయిస్‌మోంటెస్ పాటినో(టెక్సాస్)లను కోట్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. లారెడోలోని ఫెడరల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చిందని పేర్కొంది. ఈ విషయమై అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ మాట్లాడుతూ.. ‘అమెరికాలోని న్యూయార్క్, కెంటకీ, నార్త్ కరోలినా సహా పలు నగరాల్లో 2011–13 మధ్య మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాన్‌స్టాంటీనీ, పాటినోలు టెక్సాస్‌లోని లారెడోకు తరలించారు. ఇందుకు కార్లు, కొరియర్లు, బస్సులతో పాటు ప్రైవేటు విమానాలను సైతం వాడుకున్నారు. రవీందర్ రెడ్డికి చెందిన ఎన్‌వైఎస్‌ఏ, ఇంపాక్స్ ఎల్ఎల్సీ, హర్‡్ష–నీరూ జగ్గీలకు చెందిన ఎల్‌రినో ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు లారెడోలోని కొన్ని దుకాణాల ద్వారా ఈ నగదును వాడుకలోకి తెచ్చారు. ఆ తర్వాత లాభాలను మెక్సికో డ్రగ్స్ డీలర్లకు అందించారు’ అని తెలిపారు. -
15 ఏళ్లకే ఇంజినీర్ అయ్యాడు!
వాషింగ్టన్ : ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు తనిష్క్ అబ్రహం.. చిన్నవయస్సులోనే అపారమైన మేధస్సుతో అబ్బురపరుస్తున్న ఈ బాలమేధావి మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 15 ఏళ్లకే ఇంజినీర్‌గా పట్టభద్రుడు అయ్యాడు. యూసీ డేవిస్ విద్యాసంస్థ నుంచి బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. భారత సంతతికి చెందిన తనిష్క్ అబ్రహం తన మేధస్సుతో అమెరికాలో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నవయస్సులోనే చదువులో అసాధారణ ప్రతిభ చాటుతూ.. మూడేళ్ల కిందటే మూడు డిగ్రీలు పొందాడు. ఇప్పుడు తాజాగా బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడైన తనిష్క పీహెచ్డీ చేసి.. డాక్టరేట్ పట్టా పొందాలని భావిస్తున్నాడు. 15వ ఏట అడుగుపెట్టడానికి కొన్నిరోజుల ముందే ఫాదర్స్ డే సందర్భంగా తనిష్క్ ఈ డిగ్రీ పట్టా పొందాడు. అక్కడితో అతను ఆగిపోలేదు. వెంటనే యూసీ డేవిస్ మెడికల్ సెంటర్లో తన సీనియర్ డిజైన్ ప్రాజెక్టును సమర్పించాడు. అనంతరం సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన బయోమెడికల్ ఇంజినీరింగ్ సదస్సులో పాల్గొని.. తన పరిశోధన ప్రాజెక్టు డిజైన్‌ను సమర్పించాడు. అంతేకాకుండా యూసీడీ ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ అకాడెమీలో నిర్వహించిన 3రోజుల క్రాష్కోర్సులోనూ అతను చేరాడు. బాలమేధావి తనిష్క్ అబ్రహంకు సంబంధించి మరిన్ని కథనాలు.. అమెరికా అధ్యక్ష పదవిపై బాలుడి గురి ఈ బుడ్డోడు సూపర్ ఫాస్ట్! 10 ఏళ్లకే హైస్కూల్ విద్య పూర్తి! -
అఘోరాలపై చిత్రం.. ఇండో అమెరికన్ల వ్యతిరేకత
వాషింగ్టన్: హిందూధర్మ సిద్ధాంతాన్ని వేలెత్తిచూపుతూ అంతర్జాతీయ చానెల్ సీఎన్ఎన్ అమెరికాలో అఘోరాలపై ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై భారతీయ అమెరికన్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆదివారం దాదాపు 600 మందికి పైగా ఇండియన్ అమెరికన్స్ చికాగోలోని సీఎన్ఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. రేజా అస్లాన్ అనే దర్శకుడు చిత్రించిన 'బిలీవర్' డాక్యుమెంటరీలో హిందు ధర్మశాస్త్ర గౌరవానికి భంగం కలిగేలా సన్నివేశాలు ఉన్నాయని నిరసనకారులు చెప్పారు. దాదాపు 25 లక్షల మంది భారతీయులు అమెరికాలో ప్రశాంతంగా జీవిస్తున్నారని, అస్లాన్ అనే దర్శకుడు హిందూఇజాన్ని తప్పుగా చూపుతూ ఓ డాక్యుమెంటరీ చేశారని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా(వీహెచ్‌పీఏ) అధ్యక్షుడు శాంకాంత్ సేత్ అన్నారు. బిలీవర్ను ప్రసారం చేయెద్దని గతంలోనే సీఎన్ఎన్ను కోరినట్లు వెల్లడించారు. తమ మాటలు ఖాతరు చేయకుండా డాక్యుమెంటరీని ప్రసారం చేసి సీఎన్ఎన్ ఘోరమైన పొరబాటు చేసిందని చెప్పారు. అస్లాన్ వారణాసిలోని అఘోరాలను కలిసిన తర్వాతే ఈ డాక్యుమెంటరీని చిత్రించామని చెబుతున్నారని అన్నారు. కానీ ఆయన కలిసింది అతి కొద్దిమందినేనని చెప్పారు. యోగా, స్పిరిచ్యూవాలిటీ లాంటి గొప్ప విద్యలను ప్రపంచానికి అందించిన హిందూఇజంపై అస్లాన్ ఇలాంటి షో ఎందుకు చేశారో తనకు అర్ధంకావడం లేదని అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని కరపత్రాలను నిరసనకారులకు అందజేశారు. కాగా, భారతీయ అమెరికన్ల నిరసనలపై స్పందించిన దర్శకుడు అస్లాన్.. తాను చిత్రించిన డాక్యుమెంటరీ హిందూఇజంపై కాదని, అఘోరాలు వాళ్లు చేసే దారుణమైన ఆచారాల గురించని చెప్పారు. అయితే, డాక్యుమెంటరీలో కులవివక్షపై చూపిన కొన్ని దృశ్యాలు కొంతమందికి బాధ కలిగించి ఉండొచ్చని అన్నారు. -
మళ్లీ మనోళ్లే గెలిచారు
అమెరికా స్పెల్ బీ పోటీ విజేతలుగా భారతీయ అమెరికన్లు వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన తుది పోటీలో కాన్సాస్ రాష్ట్రానికి చెందిన వన్య శివశంకర్(13), మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గోకుల్ వెంకటాచలం(14) సంయుక్త విజేతలుగా నిలిచారు. ఈ పోటీల చరిత్రలో వరుసగా రెండోసారి సంయుక్త విజేతలుగా నిలిచిన వారుగా రికార్డుకెక్కారు. ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 8వ గ్రేడ్ చదువుతున్న వన్య, గోకుల్‌లు బంగారు ట్రోఫీని అందుకున్నారు. విజేతలకు రూ. 23.60 లక్షల చొప్పున నగదు లభించనుంది. వన్య శివశంకర్... 2009 స్పెల్ బీ పోటీ విజేత కావ్య సోదరి. మొత్తం 285 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. మూడో స్థానాన్ని సైతం కోల్ షేఫర్-రే అనే భారతీయ అమెరికన్ గెలుచుకోవడం గమనార్హం.