మళ్లీ మనోళ్లే గెలిచారు | spell B winners are Indo-americans | Sakshi
Sakshi News home page

మళ్లీ మనోళ్లే గెలిచారు

Published Sat, May 30 2015 5:34 AM | Last Updated on Sun, Sep 3 2017 2:57 AM

మళ్లీ మనోళ్లే గెలిచారు

మళ్లీ మనోళ్లే గెలిచారు

అమెరికా స్పెల్ బీ పోటీ
విజేతలుగా భారతీయ అమెరికన్లు

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన తుది పోటీలో కాన్సాస్ రాష్ట్రానికి చెందిన వన్య శివశంకర్(13), మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గోకుల్ వెంకటాచలం(14) సంయుక్త విజేతలుగా నిలిచారు. ఈ పోటీల చరిత్రలో వరుసగా రెండోసారి సంయుక్త విజేతలుగా నిలిచిన వారుగా రికార్డుకెక్కారు.

ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 8వ గ్రేడ్ చదువుతున్న వన్య, గోకుల్‌లు బంగారు ట్రోఫీని అందుకున్నారు. విజేతలకు రూ. 23.60 లక్షల చొప్పున  నగదు లభించనుంది. వన్య శివశంకర్... 2009 స్పెల్ బీ పోటీ విజేత కావ్య సోదరి. మొత్తం 285 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. మూడో స్థానాన్ని సైతం కోల్ షేఫర్-రే అనే భారతీయ అమెరికన్ గెలుచుకోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement