spell b
-
స్పెల్‌బీ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
కోదాడ అర్బన్ : ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షలో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. పట్టణంలోని తేజ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఉదయ్‌కుమార్ క్యాటగిరి–3, క్యాటగిరి–4 విభాగాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీల్లో క్యాటగిరి–3 నుంచి జి.సింధు, క్యాటగిరి–4లో కె.మహతి విజేతలుగా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, డైరెక్టర్లు జానకిరామయ్య, సోమిరెడ్డి తదితరులు అభినందించారు. అదే విధంగా పట్టణంలోని మదర్ థెరిస్సా పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో క్యాటగిరి–1లో జి.వైష్ణవి, ఎ.వేద, జి.అభినవ్గౌతమ్, క్యాటగిరి–2లో డి.లక్ష్మీపూజిత, జి.లక్ష్మీనిహారిక, ఎస్.కె ఇషా, సి.హెచ్ నందన్నిహాల్, ఎస్.కె అబ్దుల్రహమాన్, క్యాటగిరి–3లో ఎం.సహస్ర, కె.జాషువాస్టాలిన్ ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.కనకదుర్గ తెలిపారు. -
మళ్లీ మనోళ్లే గెలిచారు
అమెరికా స్పెల్ బీ పోటీ విజేతలుగా భారతీయ అమెరికన్లు వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత ‘స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ’ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్థులు మరోసారి చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన తుది పోటీలో కాన్సాస్ రాష్ట్రానికి చెందిన వన్య శివశంకర్(13), మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గోకుల్ వెంకటాచలం(14) సంయుక్త విజేతలుగా నిలిచారు. ఈ పోటీల చరిత్రలో వరుసగా రెండోసారి సంయుక్త విజేతలుగా నిలిచిన వారుగా రికార్డుకెక్కారు. ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య 8వ గ్రేడ్ చదువుతున్న వన్య, గోకుల్‌లు బంగారు ట్రోఫీని అందుకున్నారు. విజేతలకు రూ. 23.60 లక్షల చొప్పున నగదు లభించనుంది. వన్య శివశంకర్... 2009 స్పెల్ బీ పోటీ విజేత కావ్య సోదరి. మొత్తం 285 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. మూడో స్థానాన్ని సైతం కోల్ షేఫర్-రే అనే భారతీయ అమెరికన్ గెలుచుకోవడం గమనార్హం. -
సందడిగా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు ప్రారంభం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్ బీ పోటీలు గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలలో మొదటి రోజున రెండు జోన్ల పోటీలు నిర్వహించారు. మొదటి జోన్లో భాగంగా విజయవాడ, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, రాజమండ్రికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రెండో జోన్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఇండియా స్పెల్ బీ ప్రతినిధి శంకర్ నారాయణ, బి మాస్టర్ విక్రమ్‌లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ డెరైక్టర్ (మార్కెటింగ్) రాణిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తదుపరి రౌండ్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, షీల్డ్‌లను అందజేశారు. -
సాక్షి స్పెల్‌బీకి విశేష స్పందన
సప్తగిరికాలనీ (కరీంనగర్ జిల్లా), న్యూస్‌లైన్ : సాక్షి, ఇండియా స్పెల్‌బీ ఆధ్వర్యంలో నగరంలోని ఐరిస్వరల్డ్ స్కూల్లో ఆదివారం జరిగిన స్పెల్‌బీ జోనల్ రౌండ్ పరీక్షకు విశేష స్పందన వచ్చింది. అక్షరదోషాలు లేకుండా ఆంగ్ల పదాలు రాయడం.. వాటిని ఎలా పల కాలో క్లుప్తంగా వివరించడం.. కొత్త ఆంగ్ల ప దాలు విద్యార్థులకు పరిచయం చేయడానికి సాక్షి, ఇండియాస్పెల్ ఆధ్వర్యంలో స్పెల్‌బీ ప రీక్షను దేశమంతటా నిర్వహిస్తోంది. ఇందు లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రిలిమినరీ రౌండ్లో విజేతలకు జోనల్‌స్థాయిలో పరీక్ష నిర్వహించారు. దీనికి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. కేటగిరీ-1లో ఒక టి, రెండో తరగతి, కేటగిరీ-2లో మూడు, నాలుగు, కేటగిరీ-3లో ఐదు నుంచి ఏడు, కేటగిరీ-4లో ఎనిమిది నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 211 మంది హాజరుకాగా.. ‘సాక్షి’ టీవీ లైవ్ ద్వారా హైదరాబాద్ నుంచి ప్రశ్నలు వేశారు. వాటికి అక్షరదోషాలు లేకుండా విద్యార్థులు పదాలు రాశారు. లైవ్ ద్వారా పరీక్ష కావడంతో చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు. పరీక్షను సాక్షి రీజనల్ మేనేజర్ ఎస్.శ్రీనివాస్, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత ప్రసాద్‌రావు పర్యవే క్షించారు. కార్యక్రమంలో సాక్షి డిప్యూటీ మేనేజర్ సంపత్‌కుమార్, ఇండియా స్పెల్‌బీ ప్రతినిధి సాయినాథ్‌రెడ్డి, ఐరిస్ పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూప్‌దత్త పాల్గొన్నారు. స్పెల్లింగ్స్ తెలిశాయి లైవ్‌లో వారు ప్రశ్నలు అడుగుతుంటే ఇంగ్లిష్‌లో ఇన్ని పదాలు ఉన్నాయా..! అని అనిపిం చింది. లెసన్స్‌లో ఉన్న వర్డ్స్ మాత్రమే మాకు తెలుసు. స్పెల్బీతో చాలా పదాలకు స్పెల్లింగ్స్ తెలిశాయి. వాటిని ఎలా పలకాలో కూడా చెప్పారు. కార్యక్రమం చాలా బాగుంది. - పవార్ కృప నక్షత్ర, ఆర్మూర్ పదాలు పలకడం నేర్చుకున్నాం ఇంగ్లిష్ అంటే చాలాఇష్టం. కొత్త పదాలు తెలుకోవాలని ఎప్పుడూ అనుకుంటా. స్పెల్‌బీ పరీక్ష చాలా బాగుంది. తెలిసిన పదాలే.. వాటిని ఇంతకుముందు వేరేలా పలి కాం. ఇప్పుడు వాటిని ఎలా పలకాలో తెలుసుకున్నాం. ఐ లైక్వెరీ మచ్. ఆల్ఆర్ మస్ట్ రైట్ దిస్ ఎగ్జామ్. - సంయుక్త, నిజామాబాద్ విద్యార్థుల ప్రతిభ తెలుస్తుంది ఆంగ్లంలో విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి సాక్షి స్పెల్బీతో ముందుకురావడం అభినందనీయం. విద్యార్థుల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడుతుంది. మా ఐరిస్ సంస్థలోనే పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉంది. ఇలాంటివి మరిన్ని నిర్వహించాలి. - ప్రసాదరావు, ఐరిస్, పారమిత విద్యాసంస్థల అధినేత