స్పెల్‌బీ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
స్పెల్‌బీ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
Published Mon, Sep 19 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
కోదాడ అర్బన్ : ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో పట్టణంలో సోమవారం నిర్వహించిన స్పెల్‌బీ పరీక్షలో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. పట్టణంలోని తేజ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఉదయ్‌కుమార్ క్యాటగిరి–3, క్యాటగిరి–4 విభాగాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. ఈ పోటీల్లో క్యాటగిరి–3 నుంచి జి.సింధు, క్యాటగిరి–4లో కె.మహతి విజేతలుగా నిలిచి జిల్లాస్థాయికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అప్పారావు, డైరెక్టర్లు జానకిరామయ్య, సోమిరెడ్డి తదితరులు అభినందించారు. అదే విధంగా పట్టణంలోని మదర్ థెరిస్సా పాఠశాలలో నిర్వహించిన పోటీల్లో క్యాటగిరి–1లో జి.వైష్ణవి, ఎ.వేద, జి.అభినవ్‌గౌతమ్, క్యాటగిరి–2లో డి.లక్ష్మీపూజిత, జి.లక్ష్మీనిహారిక, ఎస్.కె ఇషా, సి.హెచ్ నందన్‌నిహాల్, ఎస్.కె అబ్దుల్‌రహమాన్, క్యాటగిరి–3లో ఎం.సహస్ర, కె.జాషువాస్టాలిన్ ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.కనకదుర్గ తెలిపారు.
Advertisement