సందడిగా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు ప్రారంభం | Sakshi spell B competitions launched | Sakshi
Sakshi News home page

సందడిగా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు ప్రారంభం

Published Fri, Dec 27 2013 3:25 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi spell B competitions launched

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ ఆధ్వర్యంలో స్పెల్ బీ పోటీలు గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరిగే ఈ పోటీలలో మొదటి రోజున రెండు జోన్ల పోటీలు నిర్వహించారు. మొదటి జోన్‌లో భాగంగా విజయవాడ, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, రాజమండ్రికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రెండో జోన్‌లో హైదరాబాద్ జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఇండియా స్పెల్ బీ ప్రతినిధి శంకర్ నారాయణ, బి మాస్టర్ విక్రమ్‌లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ డెరైక్టర్ (మార్కెటింగ్) రాణిరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తదుపరి రౌండ్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, షీల్డ్‌లను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement