కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని విషాదాన్ని నింపింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన 46ఏళ్ల వయసులోనే కన్నుమూయడం అందర్నీ షాక్‌కి గురిచేస్తుంది. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో నటీనటులతో పాటు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
(చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?)
చాలామంది ప్రముఖులు సోషల్ మీడియాలో పునీత్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలోప పునీత్ ప్రొడక్షన్ వెంచర్ ఫ్రెంచ్ బిరియానీలో నటించిన హాస్యనటుడు డానిష్ సైత్, ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా తన "గురువు" అయిన పునీత్ మరణానికి సంతాపం తెలిపారు. అంతేకాదు డానిష్ సైత్ ట్విట్టర్‌లో " నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు.
ప్రపంచంలోనే అత్యత్తుమమైన వ్యక్తి పునీత్ అన్న ఇక లేరు. నేను ఒకసారి అడిగాను అన్న మీరే స్వంతంగా సినిమాలు తీయోచ్చు కదా ఎందుకు మా మీద డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకుంటారు. మరో తరాన్ని తీసుకురావలంటే చాలా సమయం పడుతుంది అందువల్ల ఒక తరం ఇంకోతరం కోసం కాస్త రిస్క్ తీసుకోవడానికి ముందుకి రావాలి. అంతేకాదు మా ప్రేక్షక్షులు ఎల్లప్పుడూ వినోదభరితంగా ఉండాలి అని తన గురువు పునీత్ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.
పైగా పునీత్ అన్నఒకసారి అమెజాన్ ఈవెంట్‌కి జెఫ్ బెజోస్‌తో కలిసి హాజరయ్యారు. ఇది చలనచిత్ర తారల సమూహంతో జరిగిన ఈవెంట్. ఈ ఈవెంట్‌లో అందరూ జెఫ్ బెజోస్‌తో కలిసి ఫోటోలు తీసుకుంటుంటే అన్నమాత్రం అందరికంటే భిన్నంగా దూరంగా నిలుచుని ఉన్నాడు. దీంతో అమెజాన్ బృదం ఎందుకు మీరు దూరంగా ఉన్నారు రండి ఇలా, మీరు ఎవరినైనా కలవాలనుకుంటున్నారా అని అడిగారు.
దానికి అన్న నేను పంకజ్ త్రిపాఠిని కలవాలనుకుంటున్నా అన్నారు. నిజానికి పంకజ్ త్రిపాఠి అనే పేరు ఇప్పుడు చిత్రపరిశ్రమలో సుపరిచితమైన పేరు గానీ 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌లో అద్భుతమైన పాత్ర లభించడానికి ముందు చాలా సంవత్సరాలు నటుడిగా రాణించడానికి చాలా కష్టపడ్డాడు. నా అన్న ఎప్పుడూ ప్రతిభకే మొదటి ప్రాధాన్య త ఇస్తాడు." అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment