పునీత్‌ రాజ్‌కుమార్‌: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో.. | PC Mohan Shares Puneeth Rajkumar Old Video How He Surprises His Fans | Sakshi
Sakshi News home page

Puneeth Rajkumar: పునీత్‌ రాజ్‌కుమార్‌: మళ్లీ ఇలా వస్తే ఎంత బాగుండో..

Published Sat, Oct 30 2021 7:15 PM | Last Updated on Tue, Nov 2 2021 10:16 AM

PC Mohan Shares Puneeth Rajkumar Old Video How He Surprises His Fans - Sakshi

బెంగళూరు: కన్నర పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ శుక్రవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులతో పాటు సామన్యులు, సినీ, రాజకీయ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దక్షిణాది, బాలీవుడ్‌ సినీ ప్రముఖులు పునీత్‌ మృతికి సంతాపం తెలిపారు. 

పునీత్‌ని చివరి సారిగా చూసేందుకు వస్తున్న అభిమానులతో కంఠీరవ స్టేడియం జనసంద్రాన్ని తలపిస్తుంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ స్టార్‌ హీరో అయినప్పటికి ఆయనలో ఆ గర్వం ఇసుమంత కూడా ఉండేది కాదు. అందరితో కలిసి పోయేవారు. ఇక ఆయన ఉదార మనస్తత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోగా కన్నా కూడా మంచి మనిషిగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నారు పునీత్‌.
(చదవండి: Puneeth Rajkumar: ధృతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు)

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం పునీత్‌ది. ఇక అభిమానులు, తన కో స్టార్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇవ్వడంలో ముందుంటారు పునీత్‌. ఆయన మరణం తర్వాత పునీత్‌కు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వీటిల్లో ప్రధానంగా ఓ వీడియో జనాలను కదిలిస్తోంది. దీనిలో ఉన్నట్లే పునీత్‌ మళ్లీ తిరిగి వస్తే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారు అభిమానులు.
(చదవండి: Puneeth Rajkumar: చివరి క్షణాల్లో ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?)

ఈ వీడియోలో కొందరు అభిమానులు పునీత్‌ గురించి మాట్లాడుతుంటారు. ఈ క్రమంలో పునీత్‌ అక్కడకు వచ్చి వారి వెనక నిల్చుని.. సర్‌ప్రైజ్‌ ఇస్తాడు. ఈ వీడియోని కేంద్ర మంత్రి పీసీ మోహన్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ ఆప్యాయత స్వభావం అన్ని జనరేషన్‌ల వారికి ఆయనను దగ్గర చేసింది. ఆయన నిజాయతీ మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

చదవండి: పునీత్‌ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్‌ అనే బిరుదు ఎలా వచ్చిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement