
ప్రపంచ కుబేరుడు జెఫ్ బేజోస్ తాను స్థాపించి, పెంచి పెద్ద చేసిన అమెజాన్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మార్చిన అమెజాన్ కంపెనీ సీఈవో పదవికి జులై 5న ఆయన రాజీనామా చేశారు. అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జాస్సీ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కామర్స్ రంగానికి కొత్త అర్థం చెప్పి అత్యంత విజయవంతమైన కంపెనీగా అమెజాన్ రూపొందింది. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న తొలి రోజుల్లోనే 1994లో అమెరికాలోని ఒ కార్ల షెడ్డులో అమెజాన్ తన కార్యకలాపాలు ప్రారంభించింది. జెఫ్ బేజోస్ అతని టీం అనుసరించిన వ్యూహాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ సంస్థగా మారింది. అమెజాన్ సీఈవో కమ్ చైర్మన్‌గా ఉన్న జెఫ్ బేజోస్ ఈ భూమ్మీద అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందారు. అయితే సోమవారం ఆయన తన పదవుల నుంచి తప్పుకున్నారు.
హర్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి 1997లో ఎంబీఏ పట్టా తీసుకున్న తర్వాత అప్పటికే స్టార్టప్ స్టేజ్లో ఉన్న అమెజాన్‌లో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఆండీ జాస్సీ చేరాడు. ఆ తర్వాత జెఫ్ బేజోస్‌తో కలిసి పని చేస్తూ కంపెనీనీ ఊహించని ఎత్తులకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment