న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరలో అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. జెఫ్ బెజోస్ తీసుకున్న నిర్ణయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం అభినందించారు. అమెజాన్ తదుపరి సీఈఓ ఆండీ జాస్సీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జెఫ్ బెజోస్ కు తన ఫీచర్ ప్రాజెక్ట్స్ డే వన్ ఫండ్, బెజోస్ ఎర్త్ ఫండ్ కు ఇండియన్-అమెరికన్ టాప్ ఎగ్జిక్యూటివ్ తన శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం)
Congrats @JeffBezos , best wishes for Day 1 and Earth fund. Congrats @ajassy on your new role!
— Sundar Pichai (@sundarpichai) February 2, 2021
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల: జెఫ్ బెజోస్, ఆండీ జాస్సీ మీరు కొత్త స్థానాలను చేపడుతున్నందుకు శుభాకాంక్షలు. గతంలో మీరు సాధించిన వాటికి తగిన అర్హత ఉంది అని అన్నారు.
Congratulations to @JeffBezos and @ajassy on your new roles. A well-deserved recognition of what you have accomplished.
— Satya Nadella (@satyanadella) February 2, 2021
27 ఏళ్ల క్రితం 1994లో మిస్టర్ బెజోస్ ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు అమెజాన్‌ను ప్రారంభించిన బెజోస్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీగా అమెజాన్ నిలిచింది. బెజోస్ తరువాత అమెజాన్ సీఈఓ బాధ్యతలను స్వీకరించనున్న ఆండీ జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్నారు. 1997లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన జాస్సీ అమెజాన్‌లో ఉద్యోగిగా చేరారు. బెజోస్‌కు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. కాలక్రమంలో సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2006లో అమెజాన్ వెబ్ సేవలకు నాయకత్వం వహిస్తూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతో పోటీపడే స్థాయికి దాన్ని తీర్చిదిద్దిన ఘనత జాస్సీది.
Comments
Please login to add a commentAdd a comment