Amazon Founder Jeff Bezos Engagement With Girlfriend Lauren Sanchez, Says Reports - Sakshi
Sakshi News home page

Jeff Bezos-Lauren Sanchez: ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్‌ ఫౌండర్‌ ఎంగేజ్‌మెంట్‌

Published Tue, May 23 2023 11:21 AM | Last Updated on Wed, May 24 2023 10:24 AM

Jeff Bezos Amazon founder engagement with Lauren Sanchez - Sakshi

న్యూఢిల్లీ: బిలియనీర్‌, 59 ఏళ్ల అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఎప్పటినుంచో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న వీరిద్దరూ  నిశ్చితార్థం చేసుకున్నారని  పేజ్ సిక్స్ నివేదించింది. ఈ వార్తలను వారు ధృవీకరించినట్లు కూడా పేర్కొంది.

500 మిలియన్‌ డాలర్ల విలువైన లగ్జరీ యాచ్‌ ‘కోరు’లో ఆమెకు ప్రపోజ్‌ చేశాడు బెజోస్‌. ఖరీదైన డైమండ్‌ ఉంగరంతో ఉన్న లారెన్‌ ఫోటోలు వైరల్‌గా మారాయి . 20 క్యారెట్ల హార్ట్‌ షేప్‌లో ఉన్న ఈ డైమండ్‌ రింగ్‌ విలువ  సుమారు 2.5 మిలియన్‌ డాలర్లని అంచనా. (రిలయన్స్‌ షాక్‌: ఉద్యోగాలు ఫట్‌; రానున్న కాలంలో వేలాది కోతలు!)

ఈ లవ్‌బర్డ్స్‌ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. స్టార్-స్టడెడ్ పార్టీకి ఖరీదైన బోటులో కేన్స్కు చేరుకున్నారు. భార్యతో విడాకుల తర్వాత,గత కొంత కాలంగా తన గర్ల్‌ఫ్రెండ్‌నుపెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం సాగుతున్నసంగతి తెలిసిందే. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ సాంచెజ్, బెజోస్ 2018 నుంచే  డేటింగ్‌లో ఉన్నారు. 

కాగా 25ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య మెకెంజీ స్కాట్‌తో  2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు.  బెజో, మెకెంజీ నలుగురు పిల్లలున్నారు. అటు శాంచెజ్ కూడా తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకుంది. శాంచెజ్, వైట్ సెల్ జంటకు ఎల్లా , ఇవాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement