న్యూఢిల్లీ: అమెజాన్ సీఈవో, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. జాతి వివక్ష, ఎక్కువ పనిగంటలు ఆరోపణలతో ఆయన మాజీ విమెన్ హౌస్ కీపర్ కోర్టుకెక్కడం కలకలం టెక్ వర్గాల్లో కలకలం రేపింది. సరైన తిండి, నిద్ర, కనీసం వాష్‌రూం కూడా లేకుండా అపరిశుభ్రమైన పరిస్థితులలో ఎక్కువ గంటలు పని చేయాల్సి వచ్చిందని ఆరోపిస్తూ సీటెల్ స్టేట్ కోర్టులో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు.
2019 సెప్టెంబరులో అమెజాన్ బాస్ బెజోస్ వ్యవస్థాపక సిబ్బందిలో చేరిన మెర్సిడీస్ వేదా ఈ దావా వేశారు. ఇదు నుండి ఆరుగురు హౌస్‌కీపర్‌ల బృందానికి తాను సూపర్‌వైజర్‌గా ఉన్నట్టు తెలిపారు. ఈ సమయంలో తమపై జాతి వివక్ష చూపించారనీ, కనీస విశ్రాంతి, భోజన విరామాలు లేకుండా కొన్నిసార్లు రోజుకు 10 నుండి 14 గంటలు పనిచేయించుకున్నట్టు ఆరోపించారు. నిర్ణీత విరామ గది లేదా విశ్రాంతి స్థలం లేకుండా, సరైన రెస్ట్‌రూమ్ లేకుండా దయనీయ పరిస్థితుల్లో పనిచేశామన్నారు.
కనీసం సెక్యూరిటీ రూంకు దగ్గరలోని టాయిలెట్‌ని వాడుకోనీకుండా ఆంక్షలు విధించే వారనీ, బాత్రూంలోకి ప్రవేశించడానికి కిటికీ నుండి వెళ్లమని చెప్పేవారని, ఒకదశలో హౌస్‌కీపింగ్ సిబ్బంది లాండ్రీ గదిలో తినేవారనీ వేదా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో తనను అన్యాయంగా తొలగించారని ఆమె వాపోయారు. చట్ట ప్రకారం తమకు పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయించారు.
మరోవైపు "శ్రామిక, ఉపాధి చట్టాలకనుగుణంగా శ్రామికులకు వేతనాలు చెల్లించడమే కాకుండా, వారికి సురక్షితమైన, సానిటరీ, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని’’ వేదాకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది పాట్రిక్ మెక్‌గైగన్ వాదిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలు సరైననవి కావంటూ బెజోస్ లాయర్లు తిరస్కరించారు. ఈ మేరకు న్యాయవాది హ్యారీ కొరెల్ ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపారు. బెజోస్ గృహ నిర్వాహకులతో ఒకరు వేదాతో దురుసుగా ప్రవర్తించడంతో దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment