ప్రపంచ ధనవంతుల జాబితాలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు స్పేస్‌ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్‌మస్క్. ఫోర్బ్స్ తాజా జాబితా ప్రకారం ఎలన్‌మస్క్ సందప 282 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యింది. ఎలన్ మస్క్ తర్వాత రెండో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్‌బేజోస్ మార్కెట్ క్యాప్ 183.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంచుమించు తొలి రెండు స్థానాల్లో నిలిచిన వ్యక్తుల మద్య వత్యాసం వంద బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో అద్భుతం జరిగే తప్ప సంపాదన పరుల జాబితాలో సమీప భవిష్యత్తులో ఎలన్ మస్క్ దరిదాపుల్లోకి కూడా వచ్చే వారు కనిపించడం లేదు.
కరోనా సంక్షోభ సమయం తర్వాత చాలా మంది ధనవంతుల సంపద హరించుకుపోగా ఇందుకు విరుద్ధంగా ఎలన్ మస్క్ దగ్గర సంపద పోగుపడిపోతోంది. 2020 ఆరంభంలో ఎలన్‌మస్క్ సంపాదన 26 బిలియన్ డాలర్లు. కానీ ఆ ఏడాది ముగిసే సరికి ఎలన్‌మస్క్ సంపద రాకెట్ వేగంతో దూసుకుపోయింది. దీంతో 2020లో తొలిసారి ఎలన్‌మస్క్ 100 బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాడు. ఈ ఏడాదిలో అతని సంపాదన 110 బిలియన్ డాలర్లుగా ఉంది.
ప్రపంచాన్ని దాదాపు రెండేళ్ల పాటు కుదిపేసింది. ఈ సమయంలో ఎలన్ మస్క్ సంపాదన భారీగా పెరిగింది. ఇక 2021కి వచ్చే సరికి మరో 90 బిలియన్ డాలర్ల సొమ్ము ఎలన్ మస్క్ పంచన చేరింది. దీంతో ఎప్పటి నుంచో ఉన్న బిజినెస్ టైకూన్లను వెనక్కి నెట్టి ప్రపంచ కుబేరుడిగా అవతరించాడు. ఎలన్‌మస్క్ దెబ్బకి 2021 ఆరంభంలో అత్యంత ధనవంతుడిగా ఉన్న జెప్‌బేజోస్ ఏడాది ముగిసే సరికి రెండో స్థానానికి పడిపోయాడు. ఒకప్పుడు ప్రపంచ కుబేరుడిగా దీర్ఘకాలం కొనసాగిన బిల్‌గేట్స్ దగ్గరున్న సంపదకు రెట్టింపు సంపద ఈరోజు ఎలన్‌మస్క్ దగ్గర ఉంది.
Comments
Please login to add a commentAdd a comment