చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు | Chandrayaan-3 Will Be Absolute Success - Mark My Words, Says Actor R Madhavan - Sakshi
Sakshi News home page

చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు

Published Wed, Aug 23 2023 5:21 PM | Last Updated on Thu, Aug 24 2023 1:08 PM

Chandrayaan 3 will be absolute Success mark My Words says Actor R Madhavan - Sakshi

చంద్రయాన్-3 ల్యాండింగ్ మిషన్‌ సక్సెస్‌ కావడంపై అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. భారతదేశానికి చెందిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయింది. ఈ చారిత్రక క్షణాల తరువాత చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది.  ఈ అద్భుతమైన క్షణాల కోసం యావత్‌ ప్రపంచంగా  ఉత్కంఠగా ఎదురు  చూసింది. భారత్ ప్రయత్నాన్ని, కృషిని కొనియాడింది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. నీటిని కనుగొనే అవకాశం ఉన్నందున దీనిపై మరింత ఆసక్తి నెలకొంది.  ఈ సందర్భంగా  పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.  ముఖ్యంగా జెఫ్‌ బెజోస్‌, ట్విటర్‌ అధినేత ఎలాన్‌మస్క్‌ తోపాటు, నటుడు, ఆర్ మాధవన్ సహా ప్రముఖులు చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ కావాలంటూ  ముందే సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.

"రూట్ ఫర్ ఇండియా! గుడ్ లక్, చంద్రయాన్-3," బెజోస్  ఇస్రోపోస్ట్‌ను రీషేర్ చేస్తూ థ్రెడ్స్ యాప్‌లో  పేర్కొన్నారు.  అలాగే ఏరోస్పేస్ ఇంజనీర్ నంబి నారాయణన్ బయోపిక్‌ 'రాకెట్రీ: దినంబి ఎఫెక్ట్' లో కీలక పాత్ర పోషించిన మాధవన్‌ "చంద్రయాన్-3 సంపూర్ణ విజయం సాధిస్తుంది.. మార్క్‌ మై వర్డ్స్‌ అంటూ ట్విటర్‌ ద్వారా ముందుగానే అభినందలు తెలిపారు. 

సౌత్ సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, "చంద్రయాన్ ఈరోజు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది" అని పేర్కొన్నారు. టెస్లా , స్పేస్‌ఎక్స్ చీఫ్ ఎలాన్‌ మస్క్ కూడా చంద్రయాన్-3 మూన్ మిషన్‌పై స్పందించారు. 'ఇంటర్‌స్టెల్లార్' సినిమా బడ్జెట్ కంటే చంద్రయాన్-3 ఖర్చు తక్కువగా ఉందని ఎక్స్‌లో చేసిన పోస్ట్‌పై  మస్క్ స్పందిస్తూ, మిషన్ "భారతదేశానికి మంచిది" అని వ్యాఖ్యానించారు.

ఇంకా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ తదితరులు ఈ మిషన్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.కాగా ఇస్రో వెబ్‌సైట్‌తోపాటు, పలు చానెళ్లు ఈ  ల్యాండింగ్ ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి.  ఈ అద్భుత విజయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement