
ఈలాన్‌మస్క్, జెఫ్‌బేజోస్‌లో స్టార్టప్‌లతో తమ కెరీర్ ప్రారంభించి ప్రపంచంలోనే అతి పెద్ద కార్పోరేట్ కంపెనీలకు యజమానులు అయ్యారు. అయితే తమ విజయం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగే వరకు ఇద్దరు ‘తగ్గెదేలే’ అన్నట్టుగా వ్యవహరించారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా తమ గళం విప్పడం మాత్రం ఆగలేదు. ఇందుకు ఉదాహారణగా అనేక ఘటనలు ఉన్నాయి.
2004లో జరిగిన వీరిద్దరు ఓ రెస్టారెంట్‌లో కలిసి స్పేస్ గురించి సీరియస్‌గా చర్చించారు. ఇలా ఇద్దరు దిగ్గజాలు కలిసున్న ఫోటోను ఇండియన్ బిజినెస్ మ్యాగ్నెట్, ఆర్పీజీ గ్రూపు ఎండీ హార్ష్ గోయెంకా ట్వీట్ చేశాడు. ఆ ఫోటోలో ఈలాన్‌మస్క్, జెఫ్ బేజోస్‌లిద్దరు ఉన్నారు. వీరిద్దరి మధ్య పసుపు రంగులో విరబూసిన ఓ టులిప్ పువ్వు కూడా ఉంది. ఈ ఫోటోను వర్ణిస్తూ హార్ష్.. ది మోస్ట్ ఇంపార్టెంట్ టూ లిప్స్ ఇన్ ది వరల్డ్ అంటూ ఆసక్తికరంగా కామెంట్ జోడించారు. నెటిజన్లు సైతం భారీ ఎత్తున ఈ ఫోటోకు తమ స్పందన తెలుపుతున్నారు.
The most important ‘Two-lips’ in the world! pic.twitter.com/m2FHHwWCvL
— Harsh Goenka (@hvgoenka) May 15, 2022
చదవండి: హెచ్‌ఆర్ ఎంతో ప్రతిభావంతులు.. కానీ జీతం దగ్గర మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment