అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌పై మండిపడ్డారు. ఇప్పటికే పలు మార్లు బైడెన్ నిర్ణయాల్ని తూర్పారబడుతూ వస్తున్న బెజోస్..తాజాగా గ్యాస్ కంపెనీలను ఉద్దేశిస్తూ జోబైడెన్ చేసిన ట్వీట్‌పై బెజోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికాలో గ్యాస్ స్టేషన్‌లను(పెట్రోల్ బంకులు) నిర్వహిస్తున్న సంస్థలకు జోబైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ..యుద్ధం, సంక్షోభం తలెత్తింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని గ్యాస్ ధరల్ని తగ్గించాలి. ఆ ప్రభావం మీరు కొనే ప్రొడక్ట్ ధరపై ప్రభావం చూపుతుంది.ఇప్పుడే నేను చెప్పినట్లు చేయండి అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై అమెజాన్ బాస్ స్పందించారు.
Ouch. Inflation is far too important a problem for the White House to keep making statements like this. It’s either straight ahead misdirection or a deep misunderstanding of basic market dynamics. https://t.co/XgKfEICZpk
— Jeff Bezos (@JeffBezos) July 3, 2022
బైడెన్ పాలసీలపై గుర్రు
ప్రపంచంలోనే రిచెస్ట్ బిలియనీర్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్న జెఫ్‌బెజోస్..అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయాల్ని తప్పు పడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం అంశంలో బైడెన్ పాలసీలను తప్పుబడుతున్నారు. ఈ తరుణంలో జోబైడెన్ గ్యాస్ స్టేషన్ నిర్వహణ సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేయడంపై జెఫ్ బెజోస్ స్పందించారు. 'అయ్యో. ద్రవ్యోల్బణం చాలా ముఖ్యమైంది. బైడెన్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ..వైట్ హౌస్ ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా ముఖ్యం.ఈ స్టేట్మెంట్‌లు తప్పుదారి పట్టించడం లేదంటే మార్కెట్‌ను దెబ్బ తీసేస్తాయని జెఫ్ బెజోస్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment