
పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం ఈజీనే
పాన్‌కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానానికి వీలుగా ప్రత్యేక లింక్‌ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది.
న్యూఢిల్లీ: పాన్‌కార్డుతో ఆధార్ నంబర్ అనుసంధానానికి వీలుగా ప్రత్యేక లింక్‌ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారు తప్పనిసరిగా తమ ఆధార్ నంబర్‌ను పేర్కొనడంతోపాటు, పాన్‌కార్డును ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలంటూ ఆదాయపన్ను శాఖ కొత్త నిబంధన ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ నంబర్‌ను పాన్‌కార్డుతో సులభంగా అనుసంధానం చేసేందుకు ఈ–ఫైలింగ్ వెబ్‌సైట్ https://incometaxindiaefiling.gov.in/ హోమ్ పేజీలో ఎడమ వైపు ‘లింక్ ఆధార్’ పేరిట ప్రత్యేక లింక్‌ను ఏర్పాటు చేసింది.
‘‘అనుసంధానానికి పాన్ నంబర్‌తోపాటు, ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో నమోదై ఉన్న పేరు, వివరాలు అవసరం. యూఐడీఏఐ ధ్రువీకరించిన వెంటనే అనుసంధానం పూర్తవుతుంది. ఆధార్ కార్డులో ఉన్న పేరు, అనుసంధానం చేసే సమయంలో ఇచ్చిన పేరులో తేడా ఉంటే అప్పుడు ఆధార్ ఓటీపీ అవసరం ఏర్పడుతుంది’’ అని ఆదాయపన్ను శాఖ పేర్కొంది. ఓటీపీ ఆధార్ డేటాబేస్‌లో నమోదై ఉన్న సంబంధిత వ్యక్తి మొబైల్ నంబర్‌కు, ఈ మెయిల్‌కు వస్తుందని తెలిపింది. అనుసంధానం విఫలమవకుండా ఉండాలంటే పుట్టిన తేదీ, పేరు రెండూ కూడా పాన్, ఆధార్ కార్డులో ఒకే విధంగా ఉండాలని సూచించింది. ఒకవేళ ఆధార్, పాన్‌లోని పేర్ల మధ్య తేడా ఉం టే, రెండింటిలో ఏదో ఒక దానిలో పేరు మార్పునకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.