
ఆన్‌లైన్‌లోనే ఆధార్, పాన్ కార్డుల్లో మార్పులు
న్యూఢిల్లీ: పాన్, ఆధార్ కార్డులోని పేర్లు, ఇతర సమాచారంలో మార్పులు, చేర్పులకు వీలుగా ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఆదాయపన్ను శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ రెండు కార్డులను ఆన్‌లైన్ వేదికగా అనుసంధానం కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ రిటర్నులు దాఖలు చేసే వెబ్‌సైట్‌లోనే ఆదాయపన్ను శాఖ రెండు హైపర్‌లింక్‌లను అందుబాటులో ఉంచింది.
ఒకటి పాన్ కార్డు సమాచారంలో మార్పులు లేదా కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి కోసం... మరొకటి ఆధార్ కార్డులో వివరాలను మార్చుకునేందుకు ఉద్దేశిం చినది. అయితే, ఆధార్ కార్డులో మార్పులకు ఆధారంగా స్కాన్ చేసిన పత్రాలను పంపిం చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 1.22 కోట్ల మందికిపైగా పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు తమ ఆధార్ కార్డును పాన్‌కార్డుతో అనుసంధానం చేసుకున్నారు. దేశంలో 25 కోట్ల పాన్‌లు ఉండగా, వీరిలో ఏటా 6 కోట్ల మంది రిటర్నులు దాఖలు చేస్తున్నారు.