నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Published Fri, Nov 11 2016 3:44 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM
నేడు గ్రూప్-2 రాత పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని ఇదివరకే టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాదు.. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ప్రభుత్వ ఉద్యోగి అరుుతే సంస్థ ఐడీ కార్డు ) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని సూచించింది. షూస్ వేసుకొని రావొద్దని, ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించవద్దని పేర్కొంది.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటు పుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివి అనుమతించబోమని పేర్కొంది. బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్నుతోనే రాయాలని సూచించింది. కాగా, దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 6.81 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించారుు.
2500 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఎండీ రమణారావు
గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 2,500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ప్రకటించారు. ఈ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. అయితే వీలైనంత వరకు టికెట్‌కు సరిపడా చిల్లర ఇస్తే మంచిదని, అంత పెద్దనోట్లు ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వడం సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
ఇదీ షెడ్యూలు..
11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. పేపరు-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్)
11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ)
13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్)
13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్).
Advertisement