పాన్ కార్డు(శాశ్వత ఖాతా సంఖ్య) అనేది ఆదాయపు పన్ను శాఖ ప్రతి పన్ను చెల్లింపుదారుడికి కేటాయించే ఒక ప్రత్యేకమైన 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. ఇది గుర్తింపు రుజువుగా కూడా పనిచేస్తుంది. పన్ను పరిధిలోకి రాని వేతనం లేదా ప్రొఫెషనల్ ఫీజులు, నిర్ధిష్ట పరిమితులకు మించి ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు వంటి ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పువచ్చు. పలు లావాదేవీలకు పాన్ కార్డు తప్పకుండా కావాలి. ఎటువంటి సందర్భాలలో ఈ పాన్ కార్డు అవసరమే మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్ నెంబరు ఎందుకు అవసరం?
- ప్రత్యక్ష పన్నుల చెల్లింపు కోసం
- ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి
- రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే స్థిరాస్తుల అమ్మకం లేదా కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం.
- ద్విచక్ర వాహనం కాకుండా వేరే వాహనాన్ని అమ్మడం లేదా కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం.
- హోటళ్లు లేదా రెస్టారెంట్లకు ఏదైనా సమయంలో రూ.50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించే సమయంలో ఇది అవసరం.
- ఏదైనా విదేశీ దేశానికి ప్రయాణించడానికి సంబంధించి రూ.25,000 కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించే సమయంలో పాన్ నెంబర్ అవసరం.
- ఆర్‌బీఐ బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు పైన లావాదేవీలు జరిపితే పాన్ నెంబర్ తప్పకుండా అవసరం.
- కంపెనీ డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలు సమయంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తే పాన్ కార్డు కావాలి.
- మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేలకు పైన డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు పాన్ కార్డు అవసరం.
- రూ.50,000 కంటే ఎక్కువ మొత్తం బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం.
- వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ విలువ రూ.2 లక్షలు దాటితే పాన్ నెంబర్ తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
ఒకప్పుడు పాన్ కార్డు పొందాలంటే 45 రోజుల వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆధార్ ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పాన్ నెంబర్ పొందవచ్చు.
(చదవండి: బీమా కంపెనీల ఆఫర్.. పెళ్లి క్యాన్సిల్ అయితే రూ.10 లక్షలు!)
Comments
Please login to add a commentAdd a comment