పర్మినెంట్ అకౌంట్ నంబర్ లేదా పాన్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికీ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది పన్ను సంబంధిత ప్రయోజనాలకు, గుర్తింపు రుజువుగానూ పనిచేస్తుంది. ప్రతి పాన్ కార్డు ప్రత్యేకమైన పది అంకెల ఆల్ఫాన్యూమరిక్ సంఖ్యను కలిగి ఉంటుంది. దీన్ని ఆదాయపు పన్ను శాఖ లామినేటెడ్ కార్డు రూపంలో జారీ చేస్తుంది.
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన ఏ ఉత్తరప్రత్యుత్తరాలపై పాన్ కార్డు నంబరును కోట్ చేయడం తప్పనిసరి. 2005 జనవరి 1 నుంచి ఆదాయపు పన్ను శాఖకు చెల్లించాల్సిన చెల్లింపులకు చలాన్లపై పాన్ కోట్ చేయడం తప్పనిసరి. ఈ క్రింది ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లలో పాన్ ను కోట్ చేయడం కూడా తప్పనిసరి. దీని కోసం పాన్ కార్డును ఎప్పటికప్పుడు వెరిఫై చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో పాన్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియ
స్టెప్ 1: ఇన్‌కమ్ ట్యాక్స్ 'ఈ-ఫైలింగ్' పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి.
స్టెప్ 2: 'క్విక్ లింక్స్' సెక్షన్ నుంచి 'వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్' హైపర్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: పాన్, పూర్తి పేరు (పాన్ ప్రకారం), పుట్టిన తేదీ ఎంటర్ చేసి 'స్టేటస్'పై క్లిక్ చేయండి
స్టెప్ 4: ఇమేజ్‌లో ఉన్న విధంగా క్యాప్చా ఎంటర్ చేసి మీ పాన్ వివరాలను ధ్రువీకరించడానికి 'సబ్‌మిట్' పై క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment