కోత్త ఆర్థిక సంవత్సరం 2021-22 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుండటంతో భారత ప్రభుత్వం మార్చి 31 వరకు ప్రజలు తమ శాశ్వత ఖాతా సంఖ్య(పాన్) ను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీగా పేర్కొంది. గతంలో పాన్-ఆధార్ లింక్ గడువును పొడగించిన మాదిరిగానే ఈసారి కూడా పొడగిస్తారని వేచిచూశారు. కానీ, కేంద్రం గతంలో లాగే పాన్-ఆధార్ గడువును పొడగిస్తున్నట్లు ఎటువంటి సమాచారం లేదు. దీనితో చాలా మంది ప్రజలు పాన్-ఆధార్ లింక్ చేయడం కోసం ప్రయత్నించారు. కానీ, ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ మధ్యాహ్నం 12.30 గంటలకు రష్ పెరగడంతో పేజీ క్రాష్ అయింది.
అప్పటి నుంచి పాన్ - ఆధార్ లింక్ పేజీ పనిచేయడం లేదు, దీనితో ప్రజలు నిరాశకు గురయ్యారు. చాలా మంది ప్రజలు వారి కోపాన్ని, ఆవేదనను ట్విట్టర్ ద్వారా వ్యక్తపరిచారు. మార్చి 31 నాటికి రెండు గుర్తింపు కార్డులు లింక్ చేయకపోవడం తప్పనిసరి, పాన్ కార్డు పనిచేయక పోవడమే కాకుండ అదనంగా రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కొత్త పాన్ కార్డు తీసుకోవాలని ప్రయత్నిస్తే భారీ మూల్యం భారీ జరిమానా విధిస్తారు. ఎక్కువ శాతం మంది గడువు తేదీని పొడిగించాలని లేదా వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాలని ఆదాయపు పన్ను శాఖను కోరుతున్నారు. ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌లో పాన్ - ఆధార్ లింకు కనిపించక పోవడం మరొక విశేషం.
@IncomeTaxIndia portal status on last date.#IncomeTax #ITRFiling #ExtendITRDueDate@FinMinIndia @nsitharaman @Anurag_Office pic.twitter.com/zzqbAa0naE
— Saurabh Pandey (@ssaurabh05) March 31, 2021
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment