
వ్యాపార లావాదేవీలకు ఈ-వేబిల్లులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలో జరిగే వ్యాపారానికి సంబంధించి ఈ-వేబిల్లులను వాణిజ్యపన్నుల శాఖ తప్పనిసరి చేసింది. దొంగ వేబిల్లులతో అంతర్రాష్ట్ర సరుకు రవాణా యథేచ్చగా సాగుతుండడంతో వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే ఈ నిబంధనను అమలులోకి తెచ్చినప్పటికీ, వ్యాపార వర్గాలు ఆచరణలో పెట్టడం లేదు.
ఈ నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ అధికారులకు కమిషనర్ క చ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ-వేబిల్లును రెండు గంటల్లో రద్దు చేసే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఆన్‌లైన్ లాగిన్ అయ్యేటపుడు డీలర్లందరూ వారి వ్యాపారాలకు సంబంధించి పాన్‌కార్డు వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు.