ఈనెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని ఇదివరకే టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాదు.. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.