
ఆధార్‌తో 9.3 కోట్ల పాన్‌కార్డుల అనుసంధానం
న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలుకు తుది గడువైన ఈ నెల 5 నాటికి ఆధార్‌తో అనుసంధానమైన పాన్ కార్డుల సంఖ్య 9.3 కోట్లకు చేరినట్టు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. మొత్తం 30 కోట్ల పాన్ కార్డుల్లో ఇవి 30 శాతంగా పేర్కొంది. ఈ నెల చివరి వరకు గడువు ఉన్నందున ఆధార్‌తో మరిన్ని కార్డులు అనుసంధానమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
ఆధార్‌తో అనుసంధానించుకునేంత వరకు ఆయా రిటర్నులను ప్రాసెస్ చేయడం జరగదని ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది జూలై 1 నుంచి కొత్తగా పాన్ కార్డు తీసుకునే ప్రతి ఒక్కరూ ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వడంతోపాటు, ఇప్పటికే కార్డులు తీసుకుని ఉన్న వారు రిటర్నుల దాఖలుకు గాను ఆధార్‌తో లింక్ చేసుకోవాలని ఐటీ శాఖ కోరిన విషయం తెలిసిందే.