పాస్‌పోర్ట్‌కు డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు..
న్యూఢిల్లీ: మీరు పాస్‌పోర్టు దరఖాస్తు చేయాలి. మీ దగ్గర జనన దృవీకరణ పత్రం(డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్) ఉంటే త్వరగా వచ్చేస్తుంది. కానీ అదే మీదగ్గర లేకపోతే, అది రావటానికి ఓ 90రోజులు సమయం పడుతుంది. అంతేకాదు. దానికోసం మీసేవ కార్యాలయం, ఎమ్మార్వో కార్యలయం చూట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు మీకు ఆ బాధలన్నీ ఉండవు. ఎందకుంటే భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమలు లోకి తెచ్చింది.
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా పాస్‌పార్ట్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, పాన్‌కార్డులోని మీ పుట్టిన రోజు విషయాలనే పరిగణలోకి తీసుకోవాలని భారతప్రభుత్వం సూచించింది. పాసుపోర్టు చట్టం 1980 ప్రకారం, 1989 జనవరి 26 తరువాత పుట్టిన వారు పాసుపోర్టు పొందాలంటే ఖచ్ఛితంగా జనన దృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. స్కూల్ ట్రాన్సఫర్ సర్టిఫికేట్, పదో తరగతి మార్కుల మెమో, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీకార్డు, ఎల్‌ఐసీ పాలసీ బాండ్లలో ఓ ఒక్కటైనా చూపించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వులు జరీ చేస్తూ కేంద్రం చర్యలు తీసుకుంది.