పాన్ కార్డుల జారీ కోసం కొత్త కార్యక్రమం
న్యూఢిల్లీ: పాన్ కార్డులు లేనివారందరికీ వాటి జారీని కేంద్రం వేగవంతం చేయనుంది. ఇందుకోసం ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తోంది. రూ. లక్షకు మించిన ఏ కొనుగోలుకైనా పాన్ (పర్మినెంట్ అకౌంట్ నెంబర్) వివరాలు సమర్పించడాన్ని తప్పనిసరి చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది.
దేశంలో చాలా మందికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి పాన్ కార్డులు లేకపోవడం వల్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. పాన్ కార్డును ఆన్‌లైన్‌లో 48 గంటల్లోనే పొందేందుకు అవకాశమున్నప్పటికీ, గ్రామాలతో ప్రత్యేక క్యాంపుల ద్వారా పాన్ కార్డులు జారీ చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.