ఆర్థిక అవసరాలకు బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. దానికి బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. చాలామందికి ఒకటికి మించి బ్యాంకు ఖాతాలుండడం సహజం. అయితే వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. దానికి అదనపు గుర్తింపులు కావాలని ప్రత్యేక కమిటీ సూచించింది.
బ్యాంకుల్లో ఖాతాలను, ఖాతాదార్లను గుర్తించడానికి అదనపు ధ్రువీకరణ ప్రక్రియలను అమలు చేయనున్నారు. వినియోగదారు సమాచారాన్ని (కేవైసీ-నో యువర్ కస్టమర్) మరింత బలోపేతం చేయడంపై బ్యాంకులు దృష్టి సారించాయి.
ప్రస్తుత ఖాతాలన్నిటికీ ముఖ్యంగా పలు ఖాతాలు లేదా జాయింట్ ఖాతాలకు ఒకే ఫోన్ నంబరు ఉన్న ఖాతాలకు దీనిని వర్తింపజేయాలని భావిస్తున్నాయి. వేర్వేరు పత్రాలతో పలు ఖాతాలను తెరచిన ఖాతాదార్ల నుంచి మరిన్ని ధ్రువీకరణలను కోరవచ్చు.
ఇదీ చదవండి: కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
ఆర్థిక రంగంలో కేవైసీ నిబంధనలను ప్రామాణీకరించడం కోసం ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని గతంలోనే ఏర్పాటు చేసింది. పాన్, ఆధార్, మొబైల్ నంబరు తదితరాలను అదనపు గుర్తింపుల కింద పరిశీలిస్తున్నట్లు ఒక బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ చెబుతున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. వేర్వేరు కేవైసీ పత్రాలను ఉపయోగించి ఒక వ్యక్తి తెరచిన పలు ఖాతాలను కనిపెట్టడానికి, అదనపు గుర్తింపులతో వీలవుతుందని బ్యాంకులు భావిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment