కేవైసీ ఒక్కసారి చేస్తే చాలదా? | What Is Kyc Status In Mutual Fund | Sakshi
Sakshi News home page

కేవైసీ ఒక్కసారి చేస్తే చాలదా?

Published Mon, Mar 6 2023 7:07 AM | Last Updated on Mon, Mar 6 2023 7:09 AM

What Is Kyc Status In Mutual Fund - Sakshi

ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్‌ మరణించినట్టయితే అవి నామీనికి బదిలీ అవుతాయి. నామినీ విక్రయ నిబంధనలు ఏమిటి? – విశ్వ ప్రకాశ్‌
జాయింట్‌ హోల్డర్‌ ఉంటే, రెండో వాటాదారునకు అవి బదిలీ అవుతాయి. ఇది అసలు హోల్డర్‌ లేని సందర్భంగా బదిలీ చేస్తున్నారు కనుక పన్ను వర్తించదు. సంబంధిత యూనిట్లను పొందిన వారు వాటిని విక్రయించినప్పుడు పన్ను చెల్లించాలి. యూనిట్లను ఎంత కాలం ఉంచుకున్నారనే అంశాల ఆధారంగా, స్వల్పకాల, దీర్ఘకాల మూలధన లాభాలపన్ను వర్తిస్తుంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే ఏడాది కాలంలోపు విక్రయించినప్పుడు వచ్చే లాభాన్ని, స్వల్పకాల మూలధన లాభాల పన్నుగా పరిగణిస్తారు.

ఈ మొత్తంపై 15 శాతం పన్ను పడుతుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను విక్రయించినప్పుడు వచ్చే లాభం దీర్ఘకాల మూలధన లాభాల పన్నుగా చట్టం పరిగణిస్తుంది. మొదటి రూ.లక్ష లాభం మినహా మిగిలిన లాభంపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు పెట్టుబడులపై లాభాన్ని స్వల్పకాల మూలధన లాభంగాను, మూడేళ్లకు మించిన పెట్టుబడులపై లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చూస్తారు.

స్వల్పకాల మూలధన లాభం వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణాన్ని మినహాయించి, మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఒకరి నుంచి వారసత్వంగా లేదంటే నామినీగా వచ్చే పెట్టుబడులను విక్రయించినప్పుడు వాటి అసలు కొనుగోలు తేదీ నుంచి హోల్డింగ్‌ పీరియడ్‌ అమలవుతుంది. బదిలీ అయిన తేదీ కాదు. ఉదాహరణకు ఒక ఇన్వెస్టర్‌ రూ.5 లక్షల విలువైన మ్యూచువల్‌ ఫండ్స్‌ యూనిట్లను 2020లో కొనుగోలు చేసి, 2021లో మరణిస్తే, 

వివిధ మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఏకీకృత కేవైసీ ప్లాట్‌ఫామ్‌ ఉందా?– సమీర్‌ పటేల్‌ 
ప్రస్తుతం సెంట్రల్‌ కేవైసీ అనేది ఉంది. ఇన్వెస్టర్లు వారి కేవైసీ ప్రక్రియను ఒక్కసారి మాత్రమే పూర్తి చేసేందుకు సెంట్రల్‌ కేవైసీ అవకాశం కల్పిస్తోంది. వేర్వేరు మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేసే ప్రతిసారి కేవైసీ ఇవ్వాల్సిన అవసరం దీంతో ఉండదు. పాన్, చిరునామా ధ్రువీకరణను ఇన్వెస్టర్‌ పంపిణీదారు లేదా సెబీ వద్ద నమోదు అయిన మార్కెట్‌ ఇంటర్‌మీడియరీ అయిన స్టాక్‌ బ్రోకర్, డిపాజిటరీ పార్టిసిపెంట్‌కు ఇచ్చినా.. తాజా సమాచారం సెంట్రల్‌ కేవైసీ రికార్డుల్లో అప్‌డేట్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement