నెలకు 10వేలు 25ఏళ్ల పాటు పెట్టుబడి పెడితే సుమారు 15 కోట్ల వరకు డబ్బు సంపాదించడం ఎలా? ఈ రహస్యాన్నే హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ బహిర్ఘతం చేశారు.
ముంబైలో జరిగిన బిజినెస్ టుడే 500 వెల్త్ క్రియేటర్ సమ్మిట్‌లో భారతీయ మార్కెట్ల భవిష్యత్తు గురించి, వ్యాపారాలు, పెట్టుబడిదారులు, కొత్తగా పుట్టుకొస్తున్న మార్కెట్ ట్రెండ్‌లు, సవాళ్లు, అవకాశాల్ని అన్వేషించడం అనే అంశంపై ఆయా కంపెనీల సీఈఓలు మాట్లాడారు.
ఈ సందర్భంగా హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్ ఎండీ, యాంఫీ ఛైర్మన్ నవనీత్ మునోత్ మాట్లాడుతూ..మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ విలువ 17 వేల కోట్లు మూడేళ్ళ క్రితం అది నేటితో పోలిస్తే సగం. మ్యూచువల్ ఫండ్ మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకు చేరుకోవడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. 2017లో 4,000 కోట్లు, 2018లో 8,000 కోట్లు, ఇప్పుడు 2023లో 17,000 కోట్లుగా ఉందని అన్నారు.
అనంతరం.. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులతో భారీ రాబడులే వచ్చాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో నెలకు రూ.10వేల చొప్పున 25 నుంచి 30 ఏళ్లు పెట్టుబడులు పెడితే 18-19 శాతం వడ్డీ ఇలా అసలు వడ్డీ మొత్తం కలుపుకుని రూ.15 కోట్లు వచ్చాయి.
అయితే, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పరంగా అంత సానుకూలత లేదు. కాబట్టి రాబోయే 28 సంవత్సరాలలో రూ.10వేలు పెట్టుబడి పెడితే ఇంత భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదించవచ్చా’ అంటే ఖచ్చితంగా చెప్పలేను అని అన్నారు. అయితే ఇది దేశ సామర్ధ్యం ఎలా ఉందో నిరూపిస్తుంది. పెట్టుబడుల పరంగా భారత్ మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు అత్యుత్తమం అంటూ నవనీత్ మునోత్ తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment