ఆధార్‌యేతర కేవైసీపై పీఎఫ్‌ఆర్‌డీఏ కసరత్తు
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) స్కీమ్ ఆన్‌లైన్ సౌలభ్యతకు సంబంధించి కొత్త చందాదారులకు తాజా కేవైసీ (నో-యువర్-కస్టమర్) నిబంధనల రూపకల్పనకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్-పీఎఫ్‌ఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. ధుృవీకరణకు సంబంధించి ఆధార్ కార్డ్ వినియోగంపై సుప్రీంకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఫండ్ రెగ్యులేటర్ ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతోందని చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ సీఐఐ గురువారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమం సందర్భంగా తెలిపారు. తాజా కేవైసీ రూపకల్పనకు కొద్ది సమయం పడుతుందని తెలిపారు.