RBI Says Bank Customers No Need To Visit Bank Branches For Re KYC - Sakshi
Sakshi News home page

ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌!

Published Fri, Jan 6 2023 9:03 PM | Last Updated on Sat, Jan 7 2023 4:59 AM

RBI Says Bank Customers No Need To Visit Bank Branches For Re Kyc - Sakshi

కేవైసీ (KYC) సమాచారంలో ఎలాంటి మార్పులు లేకపోతే... రీకేవైసీ  (Re-KYC) ప్రకక్రియను పూర్తి చేసేందుకు ఖాతాదారులు సెల్ఫ్ డిక్లరేషన్‌ ఇస్తే సరిపోతుందని ఆర్బీఐ (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) స్పష్టం చేసింది. కస్టమర్‌ నమోదిత ఇ-మెయిల్‌ , ఏటీఎం, ఫోన్‌ నంబరు, డిజిటల్‌ ఛానల్‌లు (ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ యాప్‌), తదితరాల రూపంలో స్వీయ ధ్రువీకరణ ద్వారా కేవైసీని పూర్తి చేసే సదుపాయాలను ఖాతాదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది.

రీ-కెవైసి ప్రక్రియ కోసం కస్టమర్లు బ్యాంకులకు వెళ్లాల్సిన అనవసరం లేదు కాబట్టి ఇది వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందనే చెప్పాలి. ఒకవేళ అడ్రస్‌లో మార్పు మాత్రమే ఉన్నట్లయితే, కస్టమర్లు ఈ ఛానెల్‌లలో దేని ద్వారానైనా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు నెలల్లోగా డిక్లేర్డ్ అడ్రస్‌ని బ్యాంక్ వెరిఫికేషన్ చేస్తుంది. కొత్తగా కేవైసీ ప్రక్రియ చేయాలనుకున్న కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించడం ద్వారా లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా రిమోట్‌గా చేయవచ్చని’ అర్బీఐ తెలిపింది.

చదవండి: కొత్త చిక్కుల్లో ఎలాన్‌ మస్క్‌.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement