bank customer
-
ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్!
కేవైసీ (KYC) సమాచారంలో ఎలాంటి మార్పులు లేకపోతే... రీకేవైసీ (Re-KYC) ప్రకక్రియను పూర్తి చేసేందుకు ఖాతాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. కస్టమర్ నమోదిత ఇ-మెయిల్ , ఏటీఎం, ఫోన్ నంబరు, డిజిటల్ ఛానల్లు (ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ యాప్), తదితరాల రూపంలో స్వీయ ధ్రువీకరణ ద్వారా కేవైసీని పూర్తి చేసే సదుపాయాలను ఖాతాదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. రీ-కెవైసి ప్రక్రియ కోసం కస్టమర్లు బ్యాంకులకు వెళ్లాల్సిన అనవసరం లేదు కాబట్టి ఇది వారికి పెద్ద ఉపశమనం కలిగిస్తుందనే చెప్పాలి. ఒకవేళ అడ్రస్‌లో మార్పు మాత్రమే ఉన్నట్లయితే, కస్టమర్లు ఈ ఛానెల్‌లలో దేని ద్వారానైనా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండు నెలల్లోగా డిక్లేర్డ్ అడ్రస్ని బ్యాంక్ వెరిఫికేషన్ చేస్తుంది. కొత్తగా కేవైసీ ప్రక్రియ చేయాలనుకున్న కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించడం ద్వారా లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా రిమోట్‌గా చేయవచ్చని’ అర్బీఐ తెలిపింది. చదవండి: కొత్త చిక్కుల్లో ఎలాన్ మస్క్.. ఈ సారి పెద్ద తలనొప్పే వచ్చింది! -
బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే తిప్పలు తప్పవ్!
ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ ఖాతాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఇందులో ఎక్కవ శాతం సేవింగ్స్ ఖాతాదారులే ఉన్నారన విషయం విదితమే. కొందరు అవసరమై, లేదా ఏదైనా ప్రయోజనం కోసం సేవింగ్స్ ఖాతాను ఒకే బ్యాంక్‌లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో తెరుస్తుంటారు. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉంచలేక, లేదా బ్యాంక్ చార్జీలు భరించలేక ఆ అకౌంట్‌ని క్లోజ్ చేయాలని అనుకుంటుంటారు. అయితే మీ సేవింగ్స్ ఖాతా మూసివేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. 1. అకౌంట్ క్లోజ్ చేసే ముందు బ్యాలెన్స్ చెక్ చేయండి సేవింగ్స్ అకౌంట్‌ను మూసివేసే ముందు, కస్టమర్లు వారి ఖాతా బ్యాలెన్స్‌ని చెక్ చేయడం ఉత్తమం. దీంతో పాటు స్టేట్మెంట్లను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. అది మీకు భవిష్యత్తులో ఉపయోపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేసేటప్పుడు మీ స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. 2. ఆటోమేటెడ్ పేమెంట్లను రద్దు చేయండి కస్టమర్లు వారి ఖాతా ద్వారా లోన్ ఈఎంఐ (EMI)లు, బిల్లు చెల్లింపులు, నెలవారీ సబ్స్క్రిప్షన్ మొదలైన వాటికి ఆటోమెటిక్ విధానంలో ప్రతి నెల చెల్లిస్తుంటారు. మీ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారంటే ముందు ఈ తరహా చెల్లింపులను రద్దు చేయడంతో పాటు మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్ ముద్రపడే ప్రమాదముంది. 3. బకాయిలు-చార్జీలు ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు అంగీకరించవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. 4. వివిధ పోర్టల్స్ నుండి మీ సేవింగ్స్ ఖాతాను డీ-లింక్ చేయండి సంస్థల నుంచి సేవలను పొందేందుకు కస్టమర్లు వారి బ్యాంక్ ఖాతాలను ఈపీఎఫ్ఓ (EPFO), ఐటీ శాఖ మొదలైన వాటితో లింక్ చేస్తారు. ఒక వేళ మీ సేవింగ్స్ ఖాతాని క్లోజ్ చేస్తున్నట్లయితే మరొక ఖాతా నంబర్‌తో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక పెట్టుబడులు, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి. అలా చేయకపోతే సదరు సంస్థల సేవలను వినియోగించుకోలేరు. దీంతో పాటు భవిష్యత్తులో ఆర్థికపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. చదవండి: బాబోయ్.. ఆ రంగంలో ఉద్యోగాలు, మాకొద్దంటున్న గ్రాడ్యుయేట్లు! -
ఆర్బీఐ: ఇక ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ కావు!!
ఖాతాదారుల నుంచి నెలనెలా ఆటోమేటిక్‌గా డబ్బు కట్టింగ్లు అయ్యే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఖాతాదారు నుంచి అదనపు ధృవీకరణ తర్వాతే డబ్బులు కట్ అవుతాయని పేర్కొంది. ఇందుకోసం బ్యాంకుల తరపు నుంచి ఖాతాదారుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరని పేర్కొన్న ఆర్బీఐ.. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది. ఆర్బీఐ కొత్త రూల్.. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్(AFA). యూజర్ ప్రమేయం లేకుండా నెల నెలా ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావడం కుదరదు. సాధారణంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్ స్క్రిప్షన్ నెలవారీ ప్యాకేజీలు అయిపోగానే.. చాలామంది యూజర్లకు ఆటోమేటిక్‌గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యి ప్యాకేజీ రెన్యువల్ అవుతుంటుంది. తాజా నిబంధనల ప్రకారం.. ఇక మీదట అలా కుదరదు. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలు చేయనుంది. హ్యాకింగ్, ఆన్లైన్ మోసాలు, ఇంటర్నెట్ బ్యాకింగ్ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్ఏ నిబంధనను తీసుకొచ్చినట్లు తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్ డిడక్ట్ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్లైన్ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది. కార్డులతో పాటు యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI), ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ (PPI) ద్వారా చెల్లింపులకు వర్తించనుంది. క్లిక్: Cryptocurrency- ఆర్బీఐ ఆందోళన ఇక ఏఎఫ్ఏ పద్దతిలో చెల్లింపుల ద్వారా భద్రతపరమైన డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఉంటుందని ఆర్బీఐ చెబుతోంది. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలో, మొదటి ట్రాన్జాక్షన్, ప్రీ ట్రాన్జాక్షన్ నోటిఫికేషన్, విత్‌డ్రా కోసం ఏఎఫ్ఏ తప్పనిసరని, ఇదంతా యూజర్ భద్రత కోసమేనని ఆర్బీఐ అంటోంది. ఈ రూల్అమలులోకి రాగానే.. బ్యాంకులు కస్టమర్లను అప్రమత్తం చేస్తాయని వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో అమలు చేయాలనుకుంటున్న AFA పద్దతిని.. త్వరలో మిగతా అంశాల్లోనూ విస్తరించే విషయం కేవలం పరిశీలనలో మాత్రమే ఉందని ఆర్బీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించడం విశేషం. చదవండి: ఉల్లి ధరలు పెరగనున్నాయా? ఎందుకంటే.. -
ఖాతాలో కోట్లు : కంగుతిన్న కస్టమర్
అమెరికాలో ప్రసిద్ధి చెందిన సిటీ గ్రూప్ పొరపాటున 900 మిలియన్ల డాలర్లను వినియోగదారుల ఖాతాల్లోకి తరలించిన ఉదంతాన్ని మర్చిపోకముందే మరో దిగ్గజ బ్యాంకులో జరిగిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. మసాచుసెట్స్‌లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్పొరేషన్ కస్టమర్ ఖాతాలో ఇంకా పెద్ద నగదు దర్శనమివ్వడం కలకలం రేపింది. అంతేకాదు బ్యాంకు ఎంతకీ ఈ విషయాన్ని గమనించక పోవడంతో సదరు కస్టమర్ స్వయంగా బ్యాంకును సంప్రదించడంతో సమస్య పరిష్కారమైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా వినియోగదారుడు, సైకియాట్రిస్ట్ బ్లేజ్ అగ్యురేకి ఈ వింత అనుభవం ఎదురైంది. తన ఖాతాలో ఎన్నడూ లేనంతగా 2.45 బిలియన్ డాలర్లు (సుమారు182 కోట్ల రూపాయలు) చూసి ఖంగుతిన్నాడు. మొబైల్, వెబ్ లో పరిశీలించి ఖాతాలో సొమ్మును ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకుకున్నాడు. బ్యాంకు ఈ విషయాన్ని గుర్తిస్తుందని బ్లేజ్ ఎదురు చూశాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకునే దాకా అతని కంటి మీద కునుకు పట్టలేదు. అయితే జస్ట్ ఇది..డిస్ ప్లే సమస్య తప్ప మరేమీ కాదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి బిల్ హాల్డిన్ తేల్చిపారేశారు. ఈ పొరపాటును సరిదిద్దినట్టు ప్రకటించారు. మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఇలాంటి తప్పిదాలు జరగడం ఇదే మొదటిసారికాదు. ఈ నెల ప్రారంభంలో కొంతమంది ఆన్లైన్ మొబైల్-బ్యాంకింగ్ ఖాతాదారులు బ్యాలెన్స్‌లు సరిపోలక ఆందోళన చెందారు. దీంతో ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహణ, సమగ్రతపై కస్టమర్ల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా కాస్మెటిక్ దిగ్గజం రెవ్లాన్ సంస్థ అడ్మినిస్ట్రేటివ్ ఏజెంట్‌గా ఉన్న సిటీ గ్రూపు రుణదాతలకు పొరపాటున భారీ ఎత్తున చెల్లింపులు చేసిన సంగతి తెలిసిందే. -
బాదుడు షురూ..
• కొత్త చార్జీలను అమల్లోకి తెచ్చిన బ్యాంకులు • కనీస నగదు నిల్వ లేకపోయినా, పరిధి దాటిన నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలపై జరిమానాలు • జనరల్ ఖాతాదారులపై తీవ్ర భారం • బ్యాంకుల తీరుపై మండిపడుతున్న ఖాతాదారులు • చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ ఇందూరు (నిజామాబాద్ అర్బన్) : ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో ఖాతాదారులపై చార్జీల బాదుడు ప్రారంభమైంది. ఇదివరకే ఎస్బీఐ ప్రతి సేవకు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి అమలు కూడా చేసింది. మిగతా బ్యాంకులు ఎలాంటి ప్రకటనలు చేయకుండానే చార్జీలను అమలు చేస్తున్నాయి. దీంతో విషయం తెలియని ఖాతాదారులు అకౌంట్లలో కనీస నిల్వలు ఉంచక, అలాగే నగదు జమలు, ఏటీఎం విత్‌డ్రాలు పరిమితికి మించి చేస్తూ చాలామంది చార్జీల బాదుడికి గురవుతున్నారు. చెక్‌బుక్ కావాలన్నా, నెలలోమూడుసార్లకు మించి నగదు జమచేసినా, సొంత ఏటీఎంలో ఐదుసార్లకు మించి డబ్బులు విత్‌డ్రా చేసినా, అకౌంట్ మూసివేయాలనుకున్నా, పరిమితికి మించి లాకర్లను తెరిచినా.. ఇలా ప్రతి సేవలపై ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల చార్జీల అమలు తీరుపై జిల్లాలో ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చార్జీలను ఎత్తివేసి, పరిమితులను తొలగించాలని కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు 252 బ్రాంచ్‌లున్నాయి. ఆయా బ్రాంచిల్లో సురభి, బేసిక్ సేవింగ్స్, జన్‌ధన్ యోజన ఖాతాలు కాకుండా జనరల్ (వ్యక్తిగతం, సాలరీ, వ్యాపారం, తదితర) ఖాతాలు 20లక్షల వరకు ఉన్నాయి. చార్జీలు జనరల్ ఖాతాలకు మాత్రమే అమలు చేస్తున్నాయి. అయితే ఈ చార్జీల అమలు గతంలో కూడా ఉండేవని, దీనిని మళ్లీ అమలు చేస్తున్నట్లుగా బ్యాంకు అధికారులు పేర్కొంటున్నారు. చార్జీలు ఒకే విధంగా కాకుండా వివిధ బ్యాంకులు స్వల్ప తేడాతో అమలు చేస్తున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా చార్జీల అమలుతో బ్యాంకుల్లో ఖాతాదారులు నగదు జమలు చాలావరకు తగ్గించారు. చార్జీల బాదుడు ఇలా.. • సేవింగ్స్ ఖాతాదారులు నెలలో మూడుసార్లు మాత్రమే సొంత బ్యాంకు శాఖలో ఉచితంగా నగదు డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆపై ప్రతి డిపాజిట్‌కు రూ.50 చార్జీ చెల్లించాలి. • రూ.10,000 నెలవారీ సగటు నిల్వ ఉండే సాధారణ కరెంట్ ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించితే ప్రతి రూ.1000పై 75 పైసల చార్జీ ఉంటుంది. ఈ చార్జీ కూడా కనీసం రూ.50 తక్కువ కాకుండా వసూలు చేస్తారు. • నెలలో సొంత బ్యాంకు ఏటీఎంలలో ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఆపై ప్రతి లావాదేవీపై రూ.10 చార్జీ విధిస్తారు. • లాకర్లను సంవత్సరంలో 12 సార్లు మాత్రమే ఉచితంగా తెరవవచ్చు. ఆపై ప్రతిసారి రూ.100 చెల్లించాలి. • కరెంటు ఖాతాదారులకు ఏడాదిలో 50 చెక్కులే ఉచితం. ఆపై ప్రతి చెక్‌లీఫ్‌పై రూ.3 చార్జీ ఉంటుంది. • ఖాతా ప్రారంభం ఉచితంగా కాదు. రూ.20 చెల్లించాలి. • అర్బన్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో ఖాతాదారులు తమ ఖాతాల్లో రూ.3000 కనీస నగదు నిల్వ ఉంచాలి, లేదంటే రూ.50పైగా జరిమానా పడుతుంది. • సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.40 వరకు జరిమానా ఉంటుంది. • గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో రూ.1000 నగదు నిల్వ ఉంచాలి. లేదంటే రూ.30 వరకు జరిమానా తప్పదు. -
బ్యాంకుల్లో పని చేయని నెట్వర్క్
► వేతనాలు ఇవ్వక ఇబ్బందులు పడ్డ కార్మికులు గోదావరిఖని : సింగరేణిలో పని చేసే కార్మికులకు యాజమాన్యం వేతనాలను బ్యాంకు ఖా తాల్లో జమచేయగా వాటిని తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం హనుమాన్ నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో నెట్వర్క్ పని చేయకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్మికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం నెట్వర్క్ సర్వ ర్ డౌన్ కావడంతో బ్యాంకు లావాదేవీలు పూర్తి గా నిలిచిపోయాయి. దీంతో వేతనాలు తీసుకోవడానికి వచ్చిన సింగరేణి కార్మికులు వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని, బ్యాంక్ వద్దకు వచ్చే సరికి డబ్బు లేక పోవడం, నెట్వర్క్ లేదని సిబ్బంది చెబుతుండడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని ఖాతాదారులు పేర్కొన్నారు. కాగా ఈ విషయంలో బ్యాంకు అధికారులు పట్టింపులేకుండా వ్యవహరించడంతో కొంతసేపు బ్యాంకు వినియోగదారులు, కార్మికులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. మా ర్కండేయకాలనీలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌లో కూడా బుధవారం ఇదే పరిస్థితి నెలకొంది. -
మీ బ్యాంకులో గౌరవం ఉందా?
♦ ఖాతాదారులపై పక్షపాతం పనికిరాదు ♦ ఉత్పత్తుల నుంచి గోప్యత వరకూ చూడాల్సిందే ♦ మీ హక్కులకు భంగం కలిగితే ఫిర్యాదు చేయొచ్చు ♦ చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్‌ను విడుదల చేసిన ఆర్బీఐ బ్యాంకు ఖాతాదారుకూ హక్కులుంటాయా? అవును... నిజమే!! ఈ మేరకు రిజర్వు బ్యాంకు ‘చార్టర్ ఆఫ్ కస్టమర్ రైట్స్’ను కూడా విడుదల చేసింది. కాకపోతే ఇవి తమకు నిజంగా దక్కుతున్నాయా? లేదా? అనేది చూసుకోవాల్సింది ఖాతాదారులే. దక్కని పక్షంలో ఆర్బీఐకి ఫిర్యాదు చేయొచ్చు కూడా. ఆర్బీఐ జారీ చేసిన ఈ నిబంధనల్లో ఖాతాదారులకు ఐదు ప్రాథమిక హక్కులున్నాయి. ఒకవేళ బ్యాంకు ఏదైనా హక్కు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఆర్బీఐలోని కస్టమర్ సర్వీసెస్ డివిజన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. సంబంధిత బ్యాంకుపై కఠినంగా వ్యవహరించే అధికారాలు ఆర్బీఐకి ఉన్నాయి. పక్షపాత వైఖరి పనికిరాదు... ఖాతాదారులను వారి ప్రాంతం, వర్ణం, కులం, లింగం, శారీరక సామర్థ్యం, వయసు ఆధారంగా పక్షపాతంతో చూడకూడదు. కాకపోతే ఖాతాదారులకు భిన్నమైన రకాలున్న వడ్డీరేట్లతో పథకాలను మాత్రం ఆఫర్ చేయొచ్చు. అంటే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ ఆఫర్ చేయడం లాంటివన్న మాట. పారదర్శకత, నిజాయితీ... బ్యాంకు పత్రాల్లో ఉన్న భాష ఓ పట్టాన అర్థం కావడం లేదనుకోండి. అర్థమయ్యేలా మార్చాలని కోరవచ్చు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు అన్ని రకాల పత్రాలను సాధారణ వ్యక్తులు సైతం సులభంగా అర్థం చేసుకునే విధంగా రూపొందించాలి. ఈ విషయంలో జవాబుదారీ బ్యాంకులదే. పథకం, ఖాతాదారుడి బాధ్యతలు, రిస్క్ గురించి స్పష్టంగా తెలియజేయాలి. అలాగే, ముఖ్యమైన నిబంధనలు, షరతుల గురించి కూడా చెప్పాలి. కమీషన్ల కోసం అంటగ డితే తప్పే! కమిషన్ల కోసం ఖాతాదారులకు పనికిరాని ఉత్పత్తులను అంటగట్టకూడదు. ఉదాహరణకు వృద్ధులకు యూనిట్ లింక్డ్ పాలసీలను సూచించకూడదు. ఎందుకంటే వాటిలో రిస్క్ ఎక్కువుంటుంది. ఆ వయసులో వారు దాన్ని భరించటం కష్టం. కస్టమర్ల అవసరాలు తెలుసునని వాటికి సరిపోయే పథకాలను మాత్రమే సూచించాలి. గోప్యత తప్పనిసరి... ఖాతాదారుల సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంటే ఖాతాదారుల సమాచారాన్ని టెలిమార్కెటింగ్ కంపెనీలకు ఇవ్వకూడదన్న మాట. అలాగే ఇతర ప్రయోజనాల కోసం కూడా వాడుకోకూడదు. ఈ సమాచారాన్ని వేరే సంస్థలకు అందించడం వల్ల ఆయా కంపెనీలు కస్టమర్ల వివరాల ఆధారంగా వారికి తమ ఉత్పత్తులను మోసపూరిత పద్ధతిలో విక్రయించకుండా ఉండేందుకు ఆర్బీఐ ఈ నిబంధన తీసుకొచ్చింది. విక్రయంతో బాధ్యత తీరిపోదు... బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ఉత్పాదనలను మార్కెటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. సొంత పథకాలు గానీ, ఇతర సంస్థల పథకాలు గానీ విక్రయించేసి చేతులు దులుపుకోవడమంటే కుదరదు. తమవైపు తప్పిదం జరిగితే చెల్లించే పరిహారం, సమస్యవస్తే పరిష్కార విధానం, ఇతర నిబంధనల గురించి కూడా తెలియజేయాలి.