బ్యాంకుల్లో పని చేయని నెట్‌వర్క్
► వేతనాలు ఇవ్వక ఇబ్బందులు పడ్డ కార్మికులు
గోదావరిఖని : సింగరేణిలో పని చేసే కార్మికులకు యాజమాన్యం వేతనాలను బ్యాంకు ఖా తాల్లో జమచేయగా వాటిని తీసుకునేందుకు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. బుధవారం హనుమాన్ నగర్‌లోని ఆంధ్రాబ్యాంకులో నెట్‌వర్క్ పని చేయకపోవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్మికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. బుధవారం నెట్‌వర్క్ సర్వ ర్ డౌన్ కావడంతో బ్యాంకు లావాదేవీలు పూర్తి గా నిలిచిపోయాయి. దీంతో వేతనాలు తీసుకోవడానికి వచ్చిన సింగరేణి కార్మికులు వారి కుటుంబసభ్యులు ఇబ్బందులు పడ్డారు.
రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని, బ్యాంక్ వద్దకు వచ్చే సరికి డబ్బు లేక పోవడం, నెట్‌వర్క్ లేదని సిబ్బంది చెబుతుండడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నామని ఖాతాదారులు పేర్కొన్నారు. కాగా ఈ విషయంలో బ్యాంకు అధికారులు పట్టింపులేకుండా వ్యవహరించడంతో కొంతసేపు బ్యాంకు వినియోగదారులు, కార్మికులు బ్యాంకు ముందు ఆందోళన చేపట్టారు. మా ర్కండేయకాలనీలోని ఆంధ్రాబ్యాంక్ బ్రాంచ్‌లో కూడా బుధవారం ఇదే పరిస్థితి నెలకొంది.