ముంబై: ఎస్బీఐ తన ఖాతాదారులకు మరో గుడ్‌న్యూస్ అందించింది. కొద్దీ రోజుల క్రితమే గృహ రుణాలపై అందించే వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు స్థానికంగా లాక్ డౌన్ విధించాయి. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేవైసీ అప్‌డేట్ కోసం పత్రాలను మెయిల్ లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు అని భారతదేశపు అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిర్ణయించింది.
ఏప్రిల్ 30 నాటికి దేశంలో ఉన్న మొత్తం 17 స్థానిక ప్రధాన కార్యాలయాల చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఇచ్చిన సమాచారంలో కస్టమర్ మెయిల్ లేదా పోస్ట్ ద్వారా కెవైసి అప్‌డేట్ చేసిన అభ్యర్థనలను అంగీకరించాలని సూచించారు. ఈ చర్యను ఇతర ప్రభుత్వ రంగ రుణదాతలు అనుసరిస్తారని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లోని విధించిన కోవిడ్ -19 లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులు పోస్ట్ ద్వారా స్వీకరించిన పత్రాల ఆధారంగా శాఖలు కేవైసీ నవీకరణను నిర్వహించగలవని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేవైసీ నవీకరణ కోసం కస్టమర్‌ను వ్యక్తిగతంగా బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేదు. "అంతేకాక కేవైసీ అప్‌డేట్ గడువును మే 31 వరకు పొడిగిస్తున్నాం” అని ఎస్బీఐ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
Important announcement for our customers in view of the lockdowns in place in various states. #KYCUpdation #KYC #StayStrongIndia #SBIAapkeSaath #StaySafe #StayStrong pic.twitter.com/oOGxPcZjeF
— State Bank of India (@TheOfficialSBI) May 1, 2021
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment