2021 ఎండ్ కాబోతుంది. కొత్త ఏడాది 2022 మరో నాలుగు రోజుల్లో రానుంది. పలు ఆర్థిక కార్యకలాపాలకు, ద్రువీకరణలకు, ఆధార్ లింక్‌కు, పలు ఖాతాల కేవైసీ అప్‌డేట్‌కు డిసెంబర్ 31తో డెడ్‌లైన్ ముగియనుంది. వీటిని పూర్తి చేయకపోతే ఆయా సంస్థలు అందించే ఫలాలు నష్టపోయే అవకాశం ఉంది.
► జీవన ద్రువీకరణ: పెన్షనర్లు జీవన ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికెట్)ను సమర్పించాల్సిన గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ప్రతి ఏడాది నవంబర్ 30లోపు ప్రభుత్వ ఫించనుదారులు వారి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉండేది. అప్పుడే పెన్షన్‌దారులు ఎలాంటి అవాంతరాలూ లేకుండా పెన్షన్ పొందవచ్చును. బ్యాంకు, పోస్టాఫీసు, డోర్ స్టెప్, ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో ఆన్‌లైన్ ద్వారా గానీ లైఫ్ సర్టిఫికెట్‌ను సమర్పించవచ్చును.
► ఆధార్, పీఎఫ్ లింక్: ఈపీఫ్ ఖాతాకు, ఆధార్‌ను అనుసంధానించడాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తప్పనిసరి చేసింది. ఆధార్ అనుసంధానం కోసం డిసెంబరు 31, 2021 వరకు గడువు ఇచ్చింది. ఆధార్‌తో అనుసంధానించని ఖాతాలకు ఈసీఆర్ దాఖలు చేయలేరు. దీంతో ఆయా సంస్థలు అందించే కాంట్రీబ్యూషన్ నిలిచిపోతుంది.
► ఈపీఎఎఫ్‌ఓ ఈ-నామినేషన్ దాఖలు: ఈపీఎఫ్‌వో చందాదారులు డిసెంబరు 31లోపు ‘ఈ-నామినేషన్’ ప్రక్రియను పూర్తిచేయాలి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు గరిష్ఠంగా రూ.7 లక్షల బీమా హామీ లభిస్తోంది. ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగంలో ఉండగా మృతిచెందినట్లైతే, కుటుంబ సభ్యులకు ఈ పథకం కింద బీమా ప్రయోజనం అందుతుంది.
ఈపీఎఫ్ ఖాతాకు నామినీ జత చేయండి ఇలా..
- ఈపీఎఫ్ఓ పోర్టల్ అధికారిక లింక్‌పై క్లిక్ చేయండి.
- యుఏఎన్, పాస్ వర్డ్'తో లాగిన్ అవ్వండి.
- మీరు ఇంకా ఈ-నామినేషన్ చేయకపోతే మీకు పాప్ అప్ వస్తుంది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయండి.
- అలా కాకపోతే మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ-నామినేషన్ ఎంచుకోండి.
- తర్వాత 'ఫ్యామిలీ డిక్లరేషన్' అప్ డేట్ చేయడం కొరకు అవును క్లిక్ చేయండి.
- ఇప్పుడు ఒకరికన్న ఎక్కువ మంది కుటుంబ సభ్యుల ఆధార్, పేరు, పుట్టిన తేదీ, లింగం, ఫోటో, చిరునామా, బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించవచ్చు.
- వాటా మొత్తాన్ని నమోదు చేయడానికి 'నామినేషన్ వివరాలు' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత 'సేవ్ ఈపీఎఫ్ నామినేషన్' మీద క్లిక్ చేయండి.
- ఓటీపీ జెనెరేట్ చేయడం కొరకు 'ఈ సైన్' మీద క్లిక్ చేయండి. ఆధార్‌తో లింక్ చేయబడ్డ మొబైల్ నెంబరుకు వచ్చిన 'ఓటీపీ'ని సబ్మిట్ చేయండి.
- ఇప్పుడు ఈ-నామినేషన్ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అవుతుంది.
► ఐటీఆర్ ఫైలింగ్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. కోవిడ్-19, ఆదాయపు పోర్టల్‌లో వచ్చిన కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఐటీఆర్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువు ముగిసేలోపు ఐటీఆర్ దాఖలు చేయకపోతే..టాక్స్ చెల్లింపుదారులుపై రూ.5 వేలు పెనాల్టీ కట్టాల్సి వస్తోంది.
► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల కేవైసీ: స్టాక్‌చేంజ్‌లో ట్రేడింగ్ చేసే వారు తమ డీమ్యాట్ ఖాతాల కెవైసీ పూర్తి చేయాలని సెక్యురిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సూచించింది. కేవైసీ పూర్తి చేసేందుకు డిసెంబరు 31 వరకు గడువు పొడిగించింది.
చదవండి: అలర్ట్: జనవరిలో నెలలో బ్యాంక్ హాలిడేస్..! ఎన్ని రోజులంటే..!
Comments
Please login to add a commentAdd a comment