మొబైల్ కనెక్షన్కు ఆధార్ ఒక్కటీ చాలు
న్యూఢిల్లీ: మొబైల్ కనెక్షన్‌ను మరింత సులభంగా పొందేం దుకు వీలుగా ఆధార్‌ను ఈ కేవైసీగా పరిగణిస్తూ టెలికం శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో వినియోగదారులు ఆధార్ కార్డుతో వెళ్లి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డులను సత్వర యాక్టివేషన్‌తో పొందడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు కోసం ఫొటో ఐడీ, చిరునామా ఐడీ, పాస్‌పోర్ట్ ఫొటో వంటివన్నీ వెంట తీసుకెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే...
ఒకటి, రెండు రోజులకు గానీ యాక్టివేట్ కావడం లేదు.యూఐడీఏఐ నుంచి ఆధార్ నంబర్ ఆధారంగా పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ ఆపరేటర్లకు వెళతాయి. వాటిని ఆపరేటర్లు తమ డేటాబేస్‌లో భద్రపరచుకుంటే సరిపోతుంది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విధానాన్ని ఈ వారంలోనే అమల్లోకి తెస్తామని ఎయిర్‌టెల్ ప్రకటించింది. వొడాఫోన్ సైతం సానుకూల చర్యగా పేర్కొంది.