Mobile connection
-
6.8లక్షల మొబైల్ నంబర్లను ధ్రువీకరించాలన్నటెలికాంశాఖ
ఉపయోగంలోలేని, నకిలీ ధ్రువపత్రాలతో తీసుకున్న 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లను ధ్రువీకరించాలని టెలికాం శాఖ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొబైల్ నంబర్లను 60 రోజుల్లోపు గుర్తించి వెంటనే రీ-వెరిఫికేషన్ చేయాలని తెలిపింది. లేదంటే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది.నకిలీ ఫోన్ నంబర్లు, ఉపయోగంలోలేని కనెక్షన్లను గుర్తించడానికి టెలికాంశాఖ అధునాతన ఏఐను వినియోగించినట్లు ప్రకటనలో చెప్పింది. ఏఐ విశ్లేషణలో భాగంగా ఉపయోగంలోలేనివి, నకిలీ ఐడీ ప్రూఫ్‌లతో ఉన్న దాదాపు 6.8 లక్షల మొబైల్ కనెక్షన్లు గుర్తించినట్లు తెలిపింది. వెంటనే నెట్వర్క్ ఆపరేటర్లు వాటిని ధ్రువీకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ 60 రోజుల్లోపు పూర్తి చేయాలని చెప్పింది.ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండిఒకవేళ ఆపరేటర్లు ముందుగా విధించిన గడువులోపు మొబైల్ నంబర్లను ధ్రువీకరించకపోతే వాటిని డిస్కనెక్ట్ చేస్తామని హెచ్చరించింది. అవసరమైతే కొందరు ఆపరేటర్లు ఈ తంతును మళ్లీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 2024 ఏప్రిల్‌లో టెలికాంశాఖ 10,834 మొబైల్ నంబర్లపై అనుమానం వ్యక్తంచేస్తూ వీటిని రీవెరిఫికేషన్ చేయాలని తెలిపింది. వీటిలో 8,272 కనెక్షన్లు ధ్రువీకరణలో విఫలమవడంతో డిస్కనెక్ట్ చేసినట్లు పేర్కొంది. -
ఆధార్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెన్షన్ పొందేందుకు ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్, ఇతర బిల్లుల(సవరణ) చట్టం– 2019కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్ల కోసం ఆధార్‌ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ మాట్లాడుతూ..‘ప్రజల వ్యక్తిగత గోప్యత, భద్రత కోసం ఈ సవరణలు తెచ్చాం. ఆధార్ లేని కారణంగా ఎవ్వరికీ సంక్షేమ ఫలాలు నిరాకరించం. ప్రైవేటు సంస్థలు ఏవైనా ప్రజల ఆధార్ డేటాను నిల్వచేస్తే రూ.1కోటి జరిమానాతో పాటు జైలుశిక్ష పడుతుంది. ఐటీ మంత్రి హోదాలో ఓ వ్యక్తి ఆధార్ వివరాలను నేను కోరినా నాకూ మూడేళ్లశిక్ష పడుతుంది. ఆధార్ వివరాలను దేశభద్రతకు ముప్పు తలెత్తినప్పుడు, కోర్టులు ఆదేశించినప్పుడే పంచుకోవడానికి వీలవుతుంది. ఆధార్ కార్డుల్లోని పౌరుల వ్యక్తిగత సమాచారం భారత్‌లో సురక్షితంగా, భద్రంగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం 123 కోట్ల మంది ఆధార్‌ను వాడుతున్నారనీ, దీని కారణంగా ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఆదా చేయగలిగిందని వెల్లడించారు. ఆధార్ సాయంతో 4.23 కోట్ల నకిలీ ఎల్పీజీ కనెక్షన్లు, 2.98 కోట్ల బోగస్ రేషన్ కార్డులను తొలగించామన్నారు. త్వరలోనే డేటా సంరక్షణ చట్టాన్ని తెస్తామన్నారు. ఈ బిల్లును ఎన్సీపీ, సీపీఎం, ఏఐఎంఐఎం, ఐయూఎంఎల్ పార్టీలు వ్యతిరేకించాయి. ఎంసీఐ బిల్లుకు రాజ్యసభ ఓకే: భారత వైద్య మండలి(సవరణ) బిల్లు–2019కు పార్లమెంటు గురువారం ఆమోదించింది. ఇందులోని నిబంధనల మేరకు ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టగా మూజువాణీ ఓటుతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ఎంసీఐ తన విధి నిర్వహణలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి ఎంసీఐని నిర్వహించే బాధ్యతను ప్రముఖ డాక్టర్లతో కూడిన గవర్నర్ల బోర్డుకు అప్పగించాం. మేం ఈ బోర్డు వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. కానీ పర్యవేక్షణ మాత్రం కొనసాగుతుంది’ అని తెలిపారు. అలాగే బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతామన్నారు. అద్దాల భవంతులపై ఆధారాల్లేవు.. అద్దాలతో నిర్మించిన భారీ భవంతులు ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటాయనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ లోక్‌సభలో తెలిపారు. ఓ భవనాన్ని అద్దాలతో పక్కాగా డిజైన్ చేస్తే లాభాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ‘ఈ విషయంలో గతంలో ఏవైనా అధ్యయనాలు జరిగిఉంటే నా దృష్టికి తీసుకురండి. పరిశీలిస్తాను. న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నేను ఐదేళ్లు సంతోషంగా, నిక్షేపంగా ఉన్నా’ అని మంత్రి పేర్కొన్నారు. -
వర్చువల్ ఐడీలతో ఇక మొబైల్ కనెక్షన్
న్యూఢిల్లీ: కస్టమర్ల ఆధార్ నంబర్ స్థానంలో వర్చువల్ ఐడీల స్వీకరణకు వీలుగా తమ వ్యవస్థలను మెరుగుపరచుకోవాలని ప్రభుత్వం టెలికం కంపెనీలకు సూచించింది. అలాగే, పరిమిత కేవైసీ యంత్రాంగానికి మళ్లాలని కోరింది. జూలై 1 నుంచి నూతన వర్చువల్ ఐడీ విధానాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీచేసింది. ఆధార్ నంబర్‌కు బదులు ఆధార్‌కు సంబంధించిన వర్చువల్ ఐడీలను కస్టమర్లు చెబితే సరిపోతుంది. ఓ వ్యక్తి ఆధార్ నంబర్‌కు 16 అంకెల ర్యాండమ్ నంబర్‌ను కేటాయిస్తారు. ఆధార్ రూపంలో వ్యక్తిగత డేటా దుర్వినియోగం అవుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దీన్ని ఆచరణలోకి తెస్తోంది. ఈ నేపథ్యంలో టెల్కోలు ఆధార్ ఈకేవైసీ ధ్రువీకరణ స్థానంలో నూతన వర్చువల్ ఐడీ, పరిమిత ఈ–కేవైసీ ఆధారంగా కొత్త కనెక్షన్ల జారీ, చందాదారుల రీవెరిఫికేషన్‌కు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
వీసా, వర్క్ పర్మిట్ లేకుంటే మొబైల్ కనెక్షన్ కట్
- వలసదారులపై సౌదీ నిరంకుశత్వం - అటు జీతాలు రాక, ఇటు కుటుంబంతో మాట్లాడలేక తెలుగు కార్మికుల అవస్థలు మోర్తాడ్(నిజామాబాద్): అసలే తిండిలేక అల్లాడుతున్న వలసదారుల పట్ల సౌదీ అరేబియా ప్రభుత్వం మరింత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న వలసదారుల మొబైల్ ఫోన్లలో రీచార్జి చేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. మొబైల్ లో రీచార్జి చేయాలంటే.. ఫోన్ నంబర్ తోపాటు వీసా, వర్క్ పర్మిట్ నంబర్లను కూడా జత చేస్తేనే బ్యాలెన్స్ రీచార్జి అయ్యే విధంగా సాఫ్ట్‌వేర్‌ను సౌదీలో రూపొందించారు. గతంలో ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి సిమ్‌కార్డు తీసుకుంటే ఎప్పుడంటే అప్పుడు సెల్ రీచార్జి చేసుకునే వీలు ఉండేది. సౌదీలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో బిన్‌లాడెన్, సౌదీ ఓజర్ తదితర ప్రముఖ కంపెనీలతోపాటు, ఇతర చిన్న, చిన్న కంపెనీలు మూతపడటంతో వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారు. కంపెనీలను మూసివేసిన యాజమాన్యాలు కార్మికులకు బకాయిపడిన వేతనం చెల్లించకపోవడమే కాకుండా కార్మికుల పాస్‌పోర్టులు, వీసా, వర్క్ పర్మిట్లను సైతం తమ అధీనంలోనే ఉంచుకున్నాయి. దీంతో కార్మికులకు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది. ఒక్కో కార్మికుడికి తొమ్మిది నుంచి 12 నెలల వేతనంను కంపెనీలు చెల్లించాల్సి ఉంది. వేతనం చెల్లింపు విషయం ఎలా ఉన్నా కనీసం పాస్‌పోర్టు ఇస్తే ఇంటికి వెళ్లడానికి దారి దొరికేది. కానీ, కంపెనీ యాజమాన్యాలు మాత్రం కార్మికుల పాస్‌పోర్టులను ఇవ్వకుండా వీధినపడేయడంతో కార్మికులు పార్కులలోను, తమకు తెలిసినవారి గదుల్లో ఆశ్రయం పొందుతున్నారు. బయట చిన్నా చితక పనులు చేసుకుంటు రోజులు గడుపుతున్నారు. పాస్‌పోర్టు, వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న కార్మికులపై ఉక్కు పాదం మోపిన సౌదీ పోలీసులు ఇప్పటికే అనేక మందిని అరెస్టు చేసి ఔట్ జైళ్లలో బందీలుగా ఉంచారు. పోలీసుల అరెస్టులకు బయపడిన కార్మికులు కొందరు మాత్రం రహాస్య జీవనం గడుపుతున్నారు. అయితే, సెల్‌ఫోన్ రీచార్జి నిలుపుదల చేస్తే అక్రమంగా ఉంటున్న వలసదారులు ఇబ్బందులకు గురైతారని భావించిన సౌదీ ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా బ్యాలెన్స్ లేని మొబైల్ ఫోన్లకు ఇన్కమింగ్ కాల్స్ కేవలం ఒక నెల వరకే పరిమితం చేస్తున్నారు. దీంతో ప్రతి మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ రీచార్జి చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది తెలుగు కార్మికుల సెల్ఫోన్లు మూగబోయాయి. దీంతో వారి కుటుంబాలతో బంధం తాత్కలికంగా తెగిపోయింది. ఔట్ పాస్‌పోర్టులను జారీ చేస్తే తమ సొంత గ్రామాలకు వెళ్లిపోతామని కార్మికులు చెబుతున్నా విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించడం లేదు. -
మొబైల్ కనెక్షన్‌కు ఆధార్ ఒక్కటీ చాలు
న్యూఢిల్లీ: మొబైల్ కనెక్షన్‌ను మరింత సులభంగా పొందేం దుకు వీలుగా ఆధార్‌ను ఈ కేవైసీగా పరిగణిస్తూ టెలికం శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో వినియోగదారులు ఆధార్ కార్డుతో వెళ్లి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్ కార్డులను సత్వర యాక్టివేషన్‌తో పొందడానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు కోసం ఫొటో ఐడీ, చిరునామా ఐడీ, పాస్‌పోర్ట్ ఫొటో వంటివన్నీ వెంట తీసుకెళ్లి దరఖాస్తు పూరించి ఇస్తే... ఒకటి, రెండు రోజులకు గానీ యాక్టివేట్ కావడం లేదు.యూఐడీఏఐ నుంచి ఆధార్ నంబర్ ఆధారంగా పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ ఆపరేటర్లకు వెళతాయి. వాటిని ఆపరేటర్లు తమ డేటాబేస్‌లో భద్రపరచుకుంటే సరిపోతుంది. ఆధార్ ఆధారిత ఈ కేవైసీ విధానాన్ని ఈ వారంలోనే అమల్లోకి తెస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది. వొడాఫోన్ సైతం సానుకూల చర్యగా పేర్కొంది.