గతంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ డబ్బుల కోసం చాలా మంది ఇబ్బందిపడేవారు. అయితే ఇప్పుడు అలాంటి సమస్య నుంచి ఉద్యోగులను సేవ్ చేసేవిధంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏదేని సంస్థలో ఉద్యోగంలో చేరినప్పుడు, మానేసినప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవడానికి ఆ సంస్థ హెచ్ ఆర్'పై ఆధారపడవలసి వచ్చేది. ఎందుకంటే, ఉద్యోగంలో చేరినతేదీ, మానేసిన తేదీని నవీకరిస్తేనే పీఎఫ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.
కానీ, ఇప్పుడు అలా మార్చుకునే హక్కును ఈపీఎఫ్ సంస్థ ఉద్యోగికే కల్పించింది. మీరు ఇటీవల ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే, మీరు నిష్క్రమణ తేదీని దాఖలు చేయడానికి 2 నెలలు వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పీఎఫ్‌లో యజమాని చివరి సహకారం అందించిన 2 నెలల తర్వాత మాత్రమే నవీకరించబడుతుంది. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం, మీ నిష్క్రమణ తేదీ నవీకరించకపోతే, మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు లేదా ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేయలేరు. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు మాత్రమే నిష్క్రమణ తేదీని నవీకరించే హక్కును ఇచ్చింది. ఇది ఉద్యోగులకు చాలా ఉపశమనం కలిగిస్తుంది.
Employees can now update their Date of Exit on their own.
— EPFO (@socialepfo) January 24, 2022
To know more about this process, click on this link & watch this video- https://t.co/skGJdcqFW9#EPFO@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @mygovindia @PTI_News @wootaum
- మొదట https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్ ఓపెన్ చేయండి వెళ్లండి.
- ఇప్పుడు మెనూ బార్'లో ఉన్న'మేనేజ్' ట్యాబ్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు డ్రాప్ డౌన్ మెనూలో Mark Exit అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఎంపిక చేసిన ఎంప్లాయిమెంట్ డ్రాప్ డౌన్ నుంచి పిఎఫ్ అకౌంట్ నెంబరు ఎంచుకోండి.
- నిష్క్రమణ తేదీ, నిష్క్రమణకు గల కారణాన్ని కారణం నమోదు చేయండి.
- మీ ఆధార నెంబర్ కు లింకు అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ నమోదు చేయండి.
- ఆ తర్వాత చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్ డేట్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు నిష్క్రమణ తేదీ విజయవంతంగా అప్ డేట్ అవుతుంది.
(చదవండి: మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయిన రేంజ్!)
Comments
Please login to add a commentAdd a comment