EPFO To Credit 8.5 % EPF Interest by End of This Month: How to Check Your PF Balance - Sakshi
Sakshi News home page

ఈ నెలాఖరులోగా ఈపీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ!

Published Sun, Jul 25 2021 3:58 PM | Last Updated on Mon, Jul 26 2021 9:10 AM

EPFO To Credit EPF Interest This Month, Here is How To Check Balance - Sakshi

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఈ నెలాఖరులోగా చందాదారుల ఖాతాలో 8.5 శాతం ఈపీఎఫ్ వడ్డీని జమ చేసే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువగా చందాదారులు విత్ డ్రాలు చేయడంతో 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును మార్చకుండా ఉంచింది. 2020లో వచ్చిన కోవిడ్-19 కారణంగా మార్చి 2020లో పీఎఫ్ వడ్డీ రేటును 2019-20 ఆర్థిక సంవత్సరానికి 8.5 శాతానికి తగ్గించింది. గత 7 సంవత్సరాల కాలంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు ఇప్పుడే చాలా తక్కువగా ఉంది. రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటర్ వచ్చే వారం పనిదినాల్లో 6 కోట్ల మంది చందాదారుల ఖాతాలో ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం క్రెడిట్ చేయవచ్చు. కాబట్టి, ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఈపిఎఫ్ బ్యాలెన్స్ ని ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఎస్ఎమ్ఎస్, మిస్డ్ కాల్  ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా
ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి “EPFOHO UAN ENG" అని టైపు చేసి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీ పీఎఫ్ ఖాతాకు గనుక మీ మొబైల్ నెంబర్ లింకు చేసినట్లయితే, ఎస్ఎమ్ఎస్ పంపిన తర్వాత పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఒక ఎస్ఎమ్ఎస్ మీకు వస్తుంది.

అలాగే, ఈపీఎఫ్ఓ సబ్ స్క్రైబర్ మిస్డ్ కాల్ ద్వారా తన ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్ నెంబర్ ద్వారా 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వండి. ఇలా మిస్డ్ కాల్ ఇచ్చిన కొద్ది సమయం తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. అందులో మీ ఖాతా బ్యాలెన్స్ వివరాలు కనిపిస్తాయి. ఈ సౌకర్యం కెవైసీ పూర్తి చేసుకున్న చందాదారులకు మాత్రమే వర్తిస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement