పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్ఓ తీపికబురు అందించనున్నట్లు తెలుస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును నిర్ణయించడానికి గౌహతిలో మార్చి 4-5న సమావేశమవుతుంది. ఈ సమావేశంలో పీఎఫ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈపీఎఫ్ఓ బోర్డు ఆదాయాలపై చర్చించడానికి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(ఎఫ్ఐఏసీ) బుధవారం సమావేశం కానుంది. గత ఆర్థిక సంవత్సరం 2020-21కు 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ బోర్డు గత ఏడాది మార్చిలో ఖరారు చేసింది.
గత 8 ఏళ్లలో ఈపీఎఫ్ఓ అందించిన అతి తక్కువ వడ్డీ రేటు ఇదే. ఈపీఎఫ్ బోర్డు తన చందాదారులకు ఎఫ్ వై21 వడ్డీ రేటును క్రెడిట్ చేయడం ప్రారంభించింది. "2020-21 ఆర్థిక సంవత్సరానికి 8.50% వడ్డీతో 23.59 కోట్ల ఖాతాలు క్రెడిట్ చేయబడ్డాయి" అని డిసెంబర్ 20న ఒక ట్వీట్లో బోర్డు పేర్కొంది. ప్రస్తుతం పీఎఫ్‌లో డిపాజిట్ చేసిన సొమ్ముపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. అయితే ఇది మునుపటి వడ్డీ రేట్ల కంటే తక్కువ. 2019-20కి వడ్డీ రేటు 8.5 శాతంగా నిర్ణయించారు. ఇది గత 7 సంవత్సరాలలో అతి తక్కువ. 2018-19లో పీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం. 2016-17 సంవత్సరంలో EPFO సభ్యులకు 8.65 శాతం వడ్డీని ఇచ్చింది.
ఈపీఎఫ్ సభ్యులు ఎస్ఎమ్ఎస్ ద్వారా బ్యాలెన్స్ ఎంతో మనం చెక్ చేసుకోవచ్చు. కేవలం ‘EPFOHO UAN’ అని టైప్ చేసి తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి ఎస్ఎమ్ఎస్ పంపాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేయడానికి ఈపీఎఫ్ సభ్యుడు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
(చదవండి: హైదరాబాద్‌లో పెట్టుబడులకు జర్మన్ కంపెనీ రెడీ.. మూడు వేల మందికి ఉపాధి!)
Comments
Please login to add a commentAdd a comment