పీఎఫ్ వివాదాల పరిష్కారానికి మొబైల్ యాప్
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) విషయంలో తలెత్తే సమస్యలు, వివాదాలను పరిష్కరించడం కోసం మొబైల్ యాప్‌ను ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ రీజనల్ కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నూతన సంస్కరణల్లో భాగంగా రూపొందించిన మొబైల్ యాప్ వ్యవస్థను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అన్ని ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. దీని ద్వారా పీఎఫ్ అకౌంట్‌లో జమవుతున్న మొత్తాలు, ఏ మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. ఏవైనా సమస్యలున్నా విన్నవిస్తే పరిష్కరిస్తామన్నారు.