పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే | 3 new ways to check your EPF balance | Sakshi
Sakshi News home page

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే

Published Mon, Nov 2 2015 2:04 AM | Last Updated on Sat, Aug 18 2018 4:50 PM

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే - Sakshi

పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే

గతంలోలాగా  మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం కోసం పనివేళలు వృథా చేసుకొని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం మూడు రకాల ఆప్షన్స్‌ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం, లేదా మిస్‌డ్ కాల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు.
 
ఈపీఎఫ్ మొబైల్ యాప్
ప్రస్తుతం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈపీఎఫ్‌ఇండియా.కామ్ వెబ్‌సైట్‌కు వె ళ్లి అందులోని ‘అవర్ సర్వీసెస్’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో లేదు. వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో సభ్యుడు, ఉద్యోగి, పెన్షనర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.

మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి.  యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ ప్రతి ఉద్యోగికీ యూఏఎన్‌ను కేటాయిస్తోంది. ఉద్యోగులు వారి సంస్థ నుంచి ఈ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
 
మిస్‌డ్ కాల్ సర్వీస్
మీ మొబైల్‌లో ఇంటర్నెట్ సౌలభ్యం లేదనుకోండి. అప్పుడు ఏవిధంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి. మీ వద్ద యూఏఎన్ ఉంటే చాలు. మీరు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఈపీఎఫ్‌ఓ మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ నంబర్, పేరు, పుట్టిన తే ది వంటి వివరాలను ఎస్‌ఎంఎస్ చేస్తుంది. అప్పుడు మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని మీ సంస్థ చే స్తుంది. ఇలా అనుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మిస్‌డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారీ ఈపీఎఫ్‌వో మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలియజేస్తుంది.
 
ఎస్‌ఎంఎస్‌తో ఈపీఎఫ్ వివరాలు
మీకు ఒకవేళ యాక్టివేటేడ్ యూఏఎన్ లేకపోతే అప్పుడేం చేస్తారు. అప్పుడు ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏసీటీ అని టైప్ చేసి కామా పెట్టి తర్వాత యూఏఎన్ నంబర్‌ను,22 డిజిట్ల పీఎఫ్ నంబర్‌ను ఎంటర్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపి మీ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ అని టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి ఈఎన్‌జీ అని ఎంటర్ చేసి పై నంబర్‌కే ఎస్‌ఎంఎస్ పంపాలి. అప్పుడు మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement