EPF balance
-
పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక మంది ఈపీఎఫ్ సభ్యులు ఈ-పాస్‌బుక్‌లను డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ-పాస్‌బుక్ పేజీపై క్లిక్ చేసిన చాలా మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు 404 ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ‘నాట్ ఫౌండ్’ అని ఒక సందేశం కూడా వస్తోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు సర్వర్ సమస్య కారణంగా ఈపీఎఫ్‌వో పోర్టల్ ఈ-పాస్‌బుక్ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన కొంత మంది సభ్యులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో సమస్యను హైలైట్ చేస్తూ ఈపీఎఫ్‌వో హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఈపీఎఫ్‌వో స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా రెండు వారాలుగా ఈ-పాస్‌బుక్ సౌకర్యం పనిచేయడం లేదని ఖాతాదారులు చెబుతున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఈ-పాస్‌బుక్ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో వినియోగదారులు UMANG యాప్, ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి “EPFOHO UAN” అని SMS పంపడం ద్వారా లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త!
6.47 కోట్ల మంది ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని మీ పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. దీపావళి పండుగా సందర్భంగా అందరి ఖాతాలో జమ అవుతుందని భావించారు కానీ, కొంచెం ఆలస్యం అయ్యింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. ఆన్లైన్లో మీ పీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో చూసుకోవచ్చు. దీంతో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు. వెంటనే ఇలా చేయండి.. 6.47 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. Next update on 15-11-2021. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli @wootaum — EPFO (@socialepfo) November 12, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. (చదవండి: మదుపరులపై కాసుల వర్షం కురిపించిన స్టాక్స్!) -
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: 6 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ త్వరలో శుభవార్త చెప్పనుంది. తన ఖాతాదారులకు వడ్డీ జమ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్ఓ 6 కోట్ల మంది ఖాతాదారులకు దీపావళికి ముందే వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలుస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి, రిటైర్డ్ బోర్డు ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8.5 శాతంగా నిర్ణయించింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయి 8.5 శాతానికి తగ్గించింది. 2018-19లో వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ తన చందాదారులకు 8.55 శాతం వడ్డీ రేటును అందించింది. 2016-17లో వడ్డీ రేటు 8.65%గా ఉంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(పీఎంజీకెవై) కింద కొత్త నిబంధనను రూపొందించింది. ఈపీఎఫ్ సభ్యులు మూడు నెలల ప్రాథమిక వేతనం, కరువు భత్యం(డీఏ) లేదా వారి ప్రావిడెంట్ ఫండ్ డబ్బులో 75 శాతం వరకు అడ్వాన్స్ గా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. (చదవండి: డ్రీమ్-11కు షాకిచ్చిన క్యాబ్ డ్రైవర్...!) ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు రిజిస్టర్డ్ మొబైల్‌కు వస్తాయి. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.(చదవండి: ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!) -
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు అలర్ట్..!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు సెప్టెంబర్ 1 లోపు తమ ఆధార్ కార్డును ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతాలతో లింక్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సంస్థ సూచించింది.ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు పీఏఫ్ ఖాతాలకు ఆధార్ లింక్ గడువును 2021 జూన్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 1 వరకు పెంచిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకపోతే ఉద్యోగుల ఖాతాలో పీఎఫ్ డబ్బులు పడవని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్-142 ను సవరించింది. సెక్షన్-142 కింద ఉద్యోగులు ఇతర ప్రయోజనాలు, సేవలను పొందడం కోసం ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి కానుంది. "యూఏఎన్ తో ఆధార్‌ని లింక్ చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి, ఎంప్లాయర్ పీఎఫ్ అమౌంట్‌ను చెల్లించలేరని డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరిరంగన్ పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ను ఆధార్‌తో లింకు చేయండి ఇలా? అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్( www.epfindia.gov.in) ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేసి ఈ-కెవైసి పోర్టల్‌కు వెళ్లి యుఎఎన్ ఆధార్ లింక్ పై క్లిక్ చేయండి యుఎఎన్ ఖాతాలో నమోదు చేసిన మీ యుఎఎన్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ నంబర్‌ను పొందుతారు. ఓటీపీని, 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్ చేసి ఫారమ్‌ను సమర్పించండి. ఇప్పడు ఓటీపీ ధృవీకరణ ఎంపికపై క్లిక్ చేయండి. మీ ఆధార్ వివరాలను ధృవీకరించడానికి మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్, మెయిల్లో ఓటీపీ వస్తుంది. ఈ ధృవీకరణ తర్వాత మీ ఆధార్ మీ పీఎఫ్ ఖాతాకు లింక్ చేయబడుతుంది. -
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్‌కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు మెసెజ్ రూపంలో వస్తుంది. మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును. अब घर बैठे ही अपना #ईपीएफ बैलेंस चेक करें। इन आसान स्टेप्स का पालन करें और परेशानी मुक्त सेवा का आनंद लें।#EPFO #PF #पीएफ #ईपीएफओ #Employees #Services@PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @DDNewslive @airnewsalerts @mygovindia @_DigitalIndia @PTI_News pic.twitter.com/WU8L2Z2Sxl — EPFO (@socialepfo) July 8, 2021 -
యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా?
ఈపీఎఫ్ఓ వినియోగదారులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే వారి పీఎఫ్ లేదా ఈపీఎఫ్ డబ్బులను చెక్ చేసుకోనే విధంగా ఈపీఎఫ్ఓ సంస్థ కొన్ని మార్పులు చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) సభ్యులు ఇప్పుడు యూఏఎన్ నంబర్ లేకుండానే పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఈపీఎఫ్ఓ హోమ్ పేజీ(epfindia.gov.in)లో లాగిన్ అవ్వండి తర్వాత క్లిక్ హియర్ టూ నో యూవర్ పీఎఫ్ బ్యాలెన్స్ పై క్లిక్ చేయండి. epfoservices.in.epfo పేజీ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం, ఈపీఎఫ్ సెంటర్, ఎస్టాబ్లిష్మెంట్ కోడ్, పీఎఫ్ అకౌంట్ నంబర్, మిగతా వివరాలను నింపండి. ఇప్పడు ఐ అగ్రీ అనే బటన్ పై క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ లేదా మొబైల్ లో పీఎఫ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. యూఏఎన్ నంబర్‌తో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఈపీఎఫ్ఓ వినియోగదారులకు యూఏఎన్ నంబర్ ఉంటే. మెసేజ్ లేదా మిస్డ్ కాల్ సేవ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ‘EPFOHO UAN' అని ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406 వద్ద మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ లేదా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. చదవండి: మీ పేరుతో ఎవరైనా సిమ్ తీసుకున్నారో తెలుసుకోండిలా? -
ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు పసుపు–కుంకుమకు మళ్లింపు!
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులను సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఎర వేసేందుకు అన్నిశాఖల నుంచి అడ్డగోలుగా నిధుల మళ్లించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్రతి నెలా తమ వేతనం నుంచి ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్మును (పీఎఫ్) సైతం దారిమళ్లించిన ఉదంతం వెలుగు చూసింది. ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం బహిర్గతమైంది. జిల్లా పరిషత్ (జెడ్పీ) ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును సైతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.350 కోట్లు ఖాతా నుంచి మాయమయ్యాయి. సాక్షి, మచిలీపట్నం: జిల్లా పంచాయతీ (జెడ్పీ) పరిధిలో దాదాపు 10,090 మంది ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మరో 15,600 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం వారి స్థాయిని బట్టి వేతనాలుమంజూరు చేస్తుంది. వేతనాల్లో ప్రతి మాసం 10 శాతం నగదు పీఎఫ్‌గా కోత విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన అనంతరం కోత విధించిన సొమ్ముకు అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి సదరు ఉద్యోగికి అందజేస్తుంది. ఈ సొమ్మును సదరు ఉద్యోగులు వారి అత్యవసర అవసరాలకు రుణంగా పొందుతారు. అంతటి ప్రాధాన్యత కలిగిన సొమ్మును సైతం ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెన్స్ నిల్.. జిల్లా పంచాయతీ ఖాతా ఖాళీగా దర్శనమిస్తోంది. జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి రూ.350 కోట్లు సొమ్ము ఖాతాలో ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ.90,000 మాత్రమే దర్శనమిస్తోంది. ఇవి కాకుండా మరో రూ.3 కోట్ల మేర సాధారణ నిధులు సైతం కైంకర్యం చేశారు. ఎన్నికల సమయానికి కొద్ది రోజుల ముందు వరకు ఖాతాలో ఉన్న నిధులు ఒక్క సారిగా మాయం అయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది. దీనికి తోడు ఈ ఏడాది జనవరి నుంచి పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతి పంచాయతీ ఖాతాలో రూ.30 లక్షల మేర నిధులు ఉండాల్సి ఉండగా నేటికీ నయా పైసా రాని పరిస్థితి. తిరిగి ఎప్పుడిస్తారో? జెడ్పీ ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించి రూ.350 కోట్లు దారి మళ్లించారు. ఈ నిధులు తిరిగి ఎప్పుడు పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారన్న అంశంలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక కౌంటింగ్ కూడా పూర్తయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితే ఆ డబ్బును ఎవరు జమ చేస్తారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రుణాలు పెండింగ్.. ఉపాధ్యాయులు తమ అవసరాల రీత్యా పీఎఫ్ సొమ్ము నుంచి రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు, అనుమతుల ప్రక్రియ పూర్తయి నెలల గడుస్తున్నా నేటికీ నగదు అందిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 15,600 మంది ఉపాధ్యాయుల్లో దాదాపుగా 466 మంది వరకు రుణం పొందేందుకు నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.7 కోట్లకుపైగానే పెండింగ్ ఉండటం గమనార్హం. ఎన్నికల తాయిలాలకు మళ్లింపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని భావించిన టీడీపీ ప్రభుత్వం ఓటర్లకు ఎన్నికలకు ముందే తాయిలాల ఎర వేసింది. ఇందులో భాగంగా పుసుపు–కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేలు, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంపు, రైతు భరోసా తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటికి రూ.కోట్లల్లో చెల్లింపులు జరపాల్సి వచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఇతర శాఖల్లో ఉన్న నగదు మొత్తం వీటికే వెచ్చించింది. ఇదే తరుణంలో జెడ్పీ, ఉపాధ్యాయులు తమ వేతనంలో దాచుకున్న నగదును మాత్రం దారి మళ్లించింది. ఈ నిజం బయటపడకుండా రిజర్వు బ్యాంక్ పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేస్తూ వచ్చింది. ప్రస్తుతం బండారం బయట పడటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం సులువే
గతంలోలాగా మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం కోసం పనివేళలు వృథా చేసుకొని హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం మూడు రకాల ఆప్షన్స్‌ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం, లేదా మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ల ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రస్తుతం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఈపీఎఫ్ఇండియా.కామ్ వెబ్‌సైట్‌కు వె ళ్లి అందులోని ‘అవర్ సర్వీసెస్’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో లేదు. వెబ్సైట్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో సభ్యుడు, ఉద్యోగి, పెన్షనర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి. యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రతి ఉద్యోగికీ యూఏఎన్‌ను కేటాయిస్తోంది. ఉద్యోగులు వారి సంస్థ నుంచి ఈ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. మిస్డ్ కాల్ సర్వీస్ మీ మొబైల్లో ఇంటర్నెట్ సౌలభ్యం లేదనుకోండి. అప్పుడు ఏవిధంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి. మీ వద్ద యూఏఎన్ ఉంటే చాలు. మీరు 011-22901406 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఈపీఎఫ్ఓ మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ నంబర్, పేరు, పుట్టిన తే ది వంటి వివరాలను ఎస్ఎంఎస్ చేస్తుంది. అప్పుడు మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనిని మీ సంస్థ చే స్తుంది. ఇలా అనుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారీ ఈపీఎఫ్‌వో మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలియజేస్తుంది. ఎస్ఎంఎస్తో ఈపీఎఫ్ వివరాలు మీకు ఒకవేళ యాక్టివేటేడ్ యూఏఎన్ లేకపోతే అప్పుడేం చేస్తారు. అప్పుడు ఈపీఎఫ్ఓహెచ్ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏసీటీ అని టైప్ చేసి కామా పెట్టి తర్వాత యూఏఎన్ నంబర్‌ను,22 డిజిట్ల పీఎఫ్ నంబర్‌ను ఎంటర్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపి మీ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓహెచ్ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ అని టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి ఈఎన్జీ అని ఎంటర్ చేసి పై నంబర్‌కే ఎస్ఎంఎస్ పంపాలి. అప్పుడు మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి.