ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక మంది ఈపీఎఫ్ సభ్యులు ఈ-పాస్‌బుక్‌లను డౌన్‌లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ-పాస్‌బుక్ పేజీపై క్లిక్ చేసిన చాలా మంది ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌లకు 404 ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ‘నాట్ ఫౌండ్’ అని ఒక సందేశం కూడా వస్తోంది.
ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు
సర్వర్ సమస్య కారణంగా ఈపీఎఫ్‌వో పోర్టల్ ఈ-పాస్‌బుక్ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన కొంత మంది సభ్యులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌లో సమస్యను హైలైట్ చేస్తూ ఈపీఎఫ్‌వో హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఈపీఎఫ్‌వో స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా రెండు వారాలుగా ఈ-పాస్‌బుక్ సౌకర్యం పనిచేయడం లేదని ఖాతాదారులు చెబుతున్నారు.
పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి..
ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఈ-పాస్‌బుక్ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో వినియోగదారులు UMANG యాప్, ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి “EPFOHO UAN” అని SMS పంపడం ద్వారా లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు.
ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్!
Comments
Please login to add a commentAdd a comment