service down
-
పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా?
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) వెబ్సైట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. అనేక మంది ఈపీఎఫ్ సభ్యులు ఈ-పాస్‌బుక్‌లను డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఈ-పాస్‌బుక్ పేజీపై క్లిక్ చేసిన చాలా మంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు 404 ఎర్రర్ కనిపిస్తోంది. దీంతో ‘నాట్ ఫౌండ్’ అని ఒక సందేశం కూడా వస్తోంది. ఇదీ చదవండి: మాకు కన్నీళ్లు.. వాళ్లకు కోట్ల కొద్దీ బోనస్‌లా? జుకర్‌బర్గ్‌ను నిలదీసిన ఉద్యోగులు సర్వర్ సమస్య కారణంగా ఈపీఎఫ్‌వో పోర్టల్ ఈ-పాస్‌బుక్ సౌకర్యం వినియోగదారులకు అందుబాటులో లేనట్లు కనిపిస్తోంది. దీంతో విసుగెత్తిపోయిన కొంత మంది సభ్యులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో సమస్యను హైలైట్ చేస్తూ ఈపీఎఫ్‌వో హ్యాండిల్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై ఈపీఎఫ్‌వో స్పందిస్తూ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొంది. కాగా రెండు వారాలుగా ఈ-పాస్‌బుక్ సౌకర్యం పనిచేయడం లేదని ఖాతాదారులు చెబుతున్నారు. పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి.. ఈపీఎఫ్‌వో పోర్టల్‌లో ఈ-పాస్‌బుక్ సౌకర్యం ప్రస్తుతం అందుబాటులో లేని నేపథ్యంలో వినియోగదారులు UMANG యాప్, ఎస్సెమ్మెస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా తమ బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి “EPFOHO UAN” అని SMS పంపడం ద్వారా లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
ఎయిర్టెల్ సేవలకు అంతరాయం..! మీమ్స్‌తో యూజర్లు హల్చల్..!
దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ 4జీ, బ్రాడ్ బ్యాండ్ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్ టెల్ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్‌బ్యాండ్, నెట్వర్క్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్స్, సర్సీసులకు రియల్ టైం ఇన్ఫర్మేషన్ను అందించే డౌన్ డిటెక్టర్ కూడా ఎయిర్టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది. ఎయిర్ టెల్ సేవలు రావడం లేదంటూ డౌన్ డిటెక్టర్‌లో ఫిర్యాదులు ఉదయం 10:58 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కత్తా, జైపూర్, ఇండోర్, ముంబై లాంటి ప్రధాన నగరాలతో పాటుగా అనేక నగరాల్లో ఎయిర్టెల్ సేవలకు అంతరాయం కల్గినట్లు డౌన్ డిటెక్టర్ నివేదించింది. సేవల పునరుద్దరణ..! దేశవ్యాప్తంగా నెట్వర్క్, బ్రాడ్ బ్యాండ్ సేవల అంతరాయంపై ఎయిర్టెల్ స్పందించింది. శుక్రవారం తెల్లవారుజామున నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఎయిర్టెల్ తెలిపింది. ‘సాంకేతిక లోపం కారణంగా మా ఇంటర్నెట్ సేవలకు ఈ ఉదయం కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సేవలు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. మా వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము" అని ఎయిర్టెల్ ప్రతినిధి అన్నారు. కాగా చాలా మంది వినియోగదారులకు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే అంతరాయం ఉన్నట్లు అనిపించినప్పటికీ, చాలా మంది తమ సేవలు ఇంకా బ్యాకప్ కాలేదని ట్విటర్లో పేర్కొన్నారు. మీమ్స్‌తో హల్చల్..! ఎయిర్టెల్ సేవలు తగ్గుముఖం పట్టడంతో ట్విట్టర్లో యూజర్లు మీమ్స్‌తో విరుచుకపడ్డారు. యూజర్లు #AirtelDown అంటూ ట్విటర్లో ట్రెండింగ్ చేశారు. ‘ఎన్నిసార్లు నా స్మార్ట్‌ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్ బటన్ నొక్కిన కూడా రాకపోవడంతో అలసిపోయనట్లు’ ఒక నెటిజన్ మీమ్‌తో నవ్వులు పూయించాడు. మరొక నెటిజన్...దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ సేవలు ఒక్కసారిగా డౌన్ అవ్వడంతో ఇతర టెలికాం కంపెనీలు పండగ చేసుకుంటున్నాయంటూ మీమ్‌తో తెలిపాడు. #AirtelDown is trending. Flight Mode to me :- pic.twitter.com/fAVaovx5Js — Innocent Child (@bholaladkaa) February 11, 2022 People shocked over #airteldown issues. Le Vodafone : pic.twitter.com/R1koNkLht6 — Amit Sarda (@amit4738) February 11, 2022 Airtel killing everyone's internet in the morning #Airtel #AirtelDown pic.twitter.com/Yy1D3YM1Io — Krishna Agrawala (@Krishnehh) February 11, 2022 My phone to me when I continuously put my phone on flight mode :-#AirtelDown pic.twitter.com/DxyorleDX8 — Innocent Child (@bholaladkaa) February 11, 2022 #AirtelDown #AirtelDown Meanwhile other broadband companies: pic.twitter.com/iIgSHKqA4x — Wear Mask & defeat Corona🇮🇳 (@AkshayBatra2608) February 11, 2022 చదవండి: నాలుగు దశాబ్దాల తర్వాత.. స్వదేశీ ట్యాగుతో ‘థమ్స్ అప్’ అరుదైన ఘనత -
ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ డౌన్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా యూజర్లు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఫేస్‌బుక్‌తోపాటు దాని ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్, వాట్సప్‌లు ప్రపంచ వ్యాప్తంగా సరిగా పనిచేయలేదు. ట్రాఫిక్ మానిటరింగ్ వెబ్సైట్ డౌన్ డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో ఈ సమస్య తలెత్తినట్టు సదురు వెబ్సైటు పేర్కొంది. దీంతో నెటిజన్లు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తలెత్తిన సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ట్విటర్‌ను ఆశ్రయించారు. #facebookdown ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌పై ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమోజీలతో విమర్శల వర్షం కురిపించారు. అయితే రెండున్నర గంటల తరువాత ఈ సమస్య పరిష్కారం అయిందని సమాచారం. భారత్‌లో ఆదివారం సాయంత్రం డెస్క్‌టాప్ వర్షన్లలో ఈ సమస్య కనిపించింది. వినియోగదారులకు లాగిన్‌తోపాటు, పేజ్ లోడింగ్ సమస్యలు తలెత్తాయి. చాలా మంది భారత యూజర్లు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు మాములుగానే పనిచేస్తున్నాయి. -
నిలిచిన ‘మీ సేవ’లు
జిల్లాలో కేంద్రాల మూసివేత సాంకేతిక సమస్యలే కారణం ఆందోళనలో వినియోగదారులు అడ్మిషన్లకు చివరి తేదీ కావడంతో విద్యార్థుల హైరానా.. జోగిపేట: సాంకేతిక కారణాలతో జిల్లాలో మీ సేవలు శనివారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాలలో టీఎస్ ఆన్లైన్ లాగిన్ కాకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచే మీ సేవ కేంద్రాల వద్ద వారంతా వేచి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఓకే అవుతుందని నిర్వాహకులు చెప్పినా సాయంత్రం 5.30 వరకు కూడా ఓకే కాలేదు. వినియోగదారులు కేంద్రాల వద్దనే పడిగాపులుకాశారు. ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలలో అడ్మిషన్లు పొందేందుకు శనివారమే చివరి తేదీ కావడంతో విద్యార్థులు ఉదయమే మీ సేవ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ వారిలో ఆందోళన వ్యక్తం అయ్యింది. కొన్ని కేంద్రాలలో విద్యార్థులు నిర్వాహకులతో గొడవలకు దిగారు. పనిచేయకుంటే ఎందుకు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 280 కేంద్రాలలో సేవలు పనిచేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్లు టీఎస్ ఆన్లైన్ జిల్లా మేనేజర్ ప్రదీప్ తెలిపారు. డాటా బేస్ సమస్య కారణంగా పనిచేయలేకపోయాయన్నారు. సమస్యను తొలగించేందుకు ప్రయత్రాలు జరుగుతున్నాయన్నారు. అనుకోకుండా సాంకేతిక పరమైన సమస్య వచ్చిందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 5 ఏళ్లలో ఇంత పెద్ద సమస్య రాలేదని, సర్వర్ డౌన్ కారణంగా అడపాదడపా ఇబ్బందులు వచ్చినా మొత్తానికి సేవలు నిలిపివేసే సమస్య రాలేదని నిర్వాహకులు తెలిపారు.