న్యూఢిల్లీ: సోషల్ మీడియా యూజర్లు ఒక్కసారిగా నిరసన గళం విప్పారు. ఫేస్‌బుక్‌తోపాటు దాని ఆధీనంలోని ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లు ప్రపంచ వ్యాప్తంగా సరిగా పనిచేయలేదు. ట్రాఫిక్ మానిటరింగ్ వెబ్‌సైట్ డౌన్ డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆఫ్రికాలలో ఈ సమస్య తలెత్తినట్టు సదురు వెబ్‌సైటు పేర్కొంది. దీంతో నెటిజన్లు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తలెత్తిన సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ట్విటర్‌ను ఆశ్రయించారు. #facebookdown ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌పై ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎమోజీలతో విమర్శల వర్షం కురిపించారు. అయితే రెండున్నర గంటల తరువాత ఈ సమస్య పరిష్కారం అయిందని సమాచారం.
భారత్‌లో ఆదివారం సాయంత్రం డెస్క్‌టాప్ వర్షన్‌లలో ఈ సమస్య కనిపించింది. వినియోగదారులకు లాగిన్‌తోపాటు, పేజ్ లోడింగ్ సమస్యలు తలెత్తాయి. చాలా మంది భారత యూజర్లు దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు మాములుగానే పనిచేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment