సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్‌గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్‌మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.
ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో
ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్‌ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్‌గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..
ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..
» యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి
» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి
» స్క్రీన్‌పై మీ పాస్‌బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండి
ఈపీఎఫ్‌ఓ పోర్టల్ ద్వారా..
» ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయీ సెక్షన్‌కి వెళ్లి, "మెంబర్ పాస్‌బుక్"పై క్లిక్ చేయండి.
» పీఎఫ్ పాస్‌బుక్‌ని చూడటానికి, మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
» మీ UAN ఈపీఎఫ్‌ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment