EPF interest
-
ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులు ప్రారంభం
సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం.. ఈపీఎఫ్ వడ్డీ సొమ్మును అవుట్గోయింగ్ సభ్యులకు ఇప్పటికే చెల్లిస్తున్నట్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తెలిపింది. దీంతో పదవీవిరమణ పొందిన సభ్యులు వారి ఫైనల్ పీఎఫ్ సెటిల్మెంట్లతో పాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ సొమ్మును పొందుతున్నారు.ఈపీఎఫ్ వార్షిక వడ్డీ రేటు సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రకటిస్తారు. దీని ప్రకారం, ఈపీఎఫ్ సభ్యులకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీ రేటును ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇదే విషయాన్ని గత మే నెలలో ఈపీఎఫ్ఓ తెలియజేసింది. సవరించిన రేట్ల ప్రకారం వడ్డీ సొమ్మును ఇప్పటికే అవుట్గోయింగ్ సభ్యులకు చెల్లించడం ప్రారంభించినట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది.ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండిలా..ఉమంగ్ యాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు..» యాప్‌ను డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోండి» ఆప్షన్స్ నుంచి "EPFO"ని ఎంచుకుని, "View Passbook"పై క్లిక్ చేయండి» స్క్రీన్‌పై మీ పాస్‌బుక్, ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూడటానికి UAN ఎంటర్ చేసి, ‘Get OTP’పై క్లిక్ చేయండిఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా.. » ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయీ సెక్షన్‌కి వెళ్లి, "మెంబర్ పాస్‌బుక్"పై క్లిక్ చేయండి. » పీఎఫ్ పాస్‌బుక్‌ని చూడటానికి, మీ UAN, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.» మీ UAN ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయి ఉంటే 7738299899కి SMS పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. -
ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడంటే..
EPF Interest Rate: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీ రేటును పెంచుతున్నట్లు గత ఫిబ్రవరిలో ప్రకటించింది. గత ఏడాది 8.15% ఉన్న వడ్డీ రేటును 2023-24కి 8.25%కి పెంచింది.కానీ ఇప్పటి వరకు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈపీఎఫ్ వడ్డీని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి పనికొచ్చే సమాచారం ఈ కథనంలో ఇస్తున్నాం..కొనసాగుతున్న ప్రక్రియఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు వస్తుందని సభ్యుడొకరు ఇటీవల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’లో ప్రశ్నించగా ఈపీఎఫ్‌వో స్పందించింది. వడ్డీని జమచేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. కాబట్టి అతి త్వరలో మీ ఖాతాలో వడ్డీ డబ్బు కనిపించే అవకాశం ఉంది. ఈపీఎఫ్‌పై వడ్డీని బడ్జెట్ తర్వాత అంటే జూలై 23 తర్వాత బదిలీ చేయవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని 28.17 కోట్ల మంది సభ్యుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ జమ చేసింది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF)ని తరచుగా PF (ప్రావిడెంట్ ఫండ్) అంటారు. ప్రైవేటు ఉద్యోగులకు ఇది ముఖ్యమైన పొదుపు, పెన్షన్ పథకం. ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు ఈ ఫండ్ మొత్తం అందుతుంది. మధ్యలో పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. ఈపీఎఫ్, ఎంపీ చట్టం ప్రకారం, ఉద్యోగి తన నెలవారీ ఆదాయంలో 12% ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. అదే మొత్తాన్ని కంపెనీ కూడా జమ చేస్తుంది. కంపెనీ డిపాజిట్ చేసిన డబ్బులో 3.67% ఈపీఎఫ్ ఖాతాలో, మిగిలిన 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి వెళుతుంది. -
22 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్‌న్యూస్..!
22.55 కోట్ల మంది ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 8.50 శాతం వడ్డీని పీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) తెలిపింది. ఈ మేరకు ఈపీఎఫ్ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది. 22.55 crore accounts have been credited with an interest of 8.50% for the FY 2020-21. @LabourMinistry @esichq @PIB_India @byadavbjp @Rameswar_Teli — EPFO (@socialepfo) December 6, 2021 ఆన్లైన్లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా.. ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. -
ఈపీఎఫ్ వడ్డీపై కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్) 2020–21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఎంత ఇవ్వాలన్నది మార్చి 4న జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. శ్రీనగర్‌లో మార్చి 4న సమావేశం విషయమై తనకు ఆహ్వానం అందినట్టు ట్రస్టీ కేఈ రఘునాథన్ మీడియాకు తెలిపారు. తనకు వచ్చిన మెయిల్లో వడ్డీపై నిర్ణయ అంశం లేదని స్పష్టం చేశారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2019–20) సభ్యుల భవిష్యనిధి నిల్వలపై 8.5 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో అందించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు ఇంత ఇవ్వడం సాధ్యపడక పోవచ్చని, రేటును తగ్గించే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో సభ్యులు ఎక్కువగా తమ నిధులను ఉపసంహరించుకోవడంతో పాటు, తాజా జమలు తగ్గడం ఇందుకు కారణం కావచ్చని తెలుస్తోంది. 2018–19లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉన్న విషయం గమనార్హం. 2019–20కు ఆఫర్ చేసిన 8.5% రేటు అనేది 2012–13 తర్వాత అత్యంత కనిష్ట రేటు.(చదవండి: ఐదు సెకన్లలో 20 లక్షల ఎస్బీఐ పర్సనల్ లోన్) -
వడ్డీ పెంపుతో ఆకర్షణీయంగా ఈపీఎఫ్
ప్రభుత్వం కానీండి... ప్రైవేటు కానీండి. ఉద్యోగులందరికీ పరిచయం అక్కర్లేని పేరు ఈపీఎఫ్. వివరంగా చెప్పాలంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. రిటైరయ్యాకో... ఉద్యోగం మానేశాకో... పెద్ద మొత్తం చేతికొచ్చేదేమైనా ఉంటే అది ఈపీఎఫ్ నుంచే. అందుకే దీన్ని భవిష్య నిధిగా పిలుస్తుంటారు. దీన్నిపుడు మరింత పారదర్శకంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలేంటి? ఈపీఎఫ్‌లో ఎంత జమ చేయాలనేది పూర్తిగా యాజమాన్యం ఇష్టమేనా... లేక మనం కూడా మనకు నచ్చినంత దాన్లో జమ చేయొచ్చా? ఇపుడున్న వడ్డీ రేటును బట్టి చూస్తే అదనపు మొత్తం వేయటం కరెక్టేనా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ వారం ప్రాఫిట్ కథనం... ఇవీ తాజా చర్యలు... 1) ఇకపై శాశ్వతంగా పీఎఫ్ ఖాతా నంబరు ఒకటే ఉంటుంది. ఒకవేళ ఉద్యోగం మారినా సరే... అదే ఖాతా కంటిన్యూ అవుతుంది. ఖాతాలోని మొత్తాన్ని వేరే ఖాతాకు బదిలీ చేసుకోవటం వంటి ఇబ్బందులుండవన్నమాట. 2) ఖాతాలన్నిటినీ ఆన్లైన్ చేశారు. దీంతో ఎవ్వైరె నా, ఎప్పుడైనా తమ ఖాతాలోని బ్యాలెన్స్‌ను ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బదిలీ కూడా చేసుకోవచ్చు. 3) కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచబోతున్నారు. ప్రస్తుతం వ్యక్తి జీతం ఎంత ఉన్నప్పటికీ రూ.6,500 బేసిక్ శాలరీని పరిగణనలోకి తీసుకుంటే చాలు. దీన్నిపుడు రూ.15,000కు పెంచబోతున్నారు. 4) గతేడాది పీఎఫ్ ఖాతాలోని మొత్తంపై 8.5 శాతం వడ్డీ ఇచ్చారు. ఈ ఏడాది దాన్ని మరో 0.25 శాతం... అంటే 8.75 శాతానికి పెంచారు. ఇరవై మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న ప్రతి సంస్థా తప్పనిసరిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం మీ జీతంపై (బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతం సంస్థ చెల్లించాలి. దానికి సమానంగా ఉద్యోగి జీతం నుంచి మరో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాకి జమ చేస్తాడు. ఉదాహరణకి మీ జీతం (బేసిక్ + డీఏ) రూ.20,000 అనుకుంటే ప్రతినెలా కంపెనీ రూ.2,400, మీరు రూ.2,400 జమ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు ఇలా జమ చేస్తున్నా, ప్రైవేటు సంస్థల్లో చాలావరకూ ఇలా చేయటంలేదు. జీతం ఎంత ఉన్నప్పటికీ కనీసం రూ.6,500 బేసిక్ శాలరీపై 12 శాతాన్ని జమ చేయాలని చట్టం చెబుతుండటంతో దాన్ని మాత్రమే జమ చేస్తున్నాయి. అంటే రూ.20,000 జీతం ఉన్నప్పటికీ రూ.780 మాత్రమే జమ చేస్తాయన్న మాట. మరికొన్ని కంపెనీలైతే రెండు పీఎఫ్లనూ (ఉద్యోగి వాటా + యాజమాన్య వాటా) ఉద్యోగి నుంచే వసూలు చేస్తున్నాయి. దీని కోసం ఆయా కంపెనీలు కాస్ట్ టు కంపెనీ(సీటీసీ) విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం కంపెనీ చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను కూడా ఉద్యోగి వార్షిక ప్యాకేజీలో కలిపేసి ఒక ఉద్యోగి మీద ఇంత వ్యయం చేస్తున్నట్లు చూపిస్తున్నాయి. ఉదాహరణకు మీ వార్షిక జీతం రూ.5,00,000 అనుకుందాం. దీని ప్రకారం కంపెనీ పీఎఫ్ ఖాతాకు సంవత్సరానికి రూ.60,000 కేటాయించాల్సి ఉంటుంది. కాని సీటీసీ విధానంలో కంపెనీలు మీ వార్షిక జీతాన్ని రూ.5,60,000గా చూపించి రెండు పీఎఫ్‌లను మీ నుంచే జమ చేయిస్తాయి. దీని వల్ల మీ చేతికి వచ్చే జీతం తగ్గిపోతుంది. అదనంగా కేటాయించొచ్చా?.... ఇపుడు బ్యాంకుల్లో చూసినా డిపాజిట్లపై కాలపరిమితిని బట్టి 7 నుంచి 8.5 శాతం వరకు మాత్రమే వడ్డీ వస్తోంది. మిగిలిన ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో కాస్త ఎక్కువ వడ్డీ వచ్చేవి ఉన్నా... వాటిలో ప్రధాన సమస్య సెక్యూరిటీ. మనం పెట్టిన పెట్టుబడికి కూడా భద్రత సమస్యగానే ఉంటోంది. అదే పీఎఫ్‌లో అయితే భద్రత సమస్యే కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే ట్రస్టు. 5 కోట్ల మందికిపైగా ఖాతాదారులున్నారు. పెపైచ్చు ఈ ఏడాదికి (2012-13) వడ్డీరేటును 8.50 శాతం నుంచి 8.75 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటన్నిటికీ తోడు పీఎఫ్ మీద వచ్చే వడ్డీపై పన్ను కూడా ఉండదు. అందుకే దీన్లో అదనపు మొత్తాన్ని కూడా జమ చేసుకుంటే లాభమన్నది నిపుణుల సలహా. చట్ట ప్రకారం పేర్కొన్న 12 శాతం కాకుండా అదనంగా కూడా పీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు జమ చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి పరిమితులూ లేవు. అవసరమైతే మీ జీతం మొత్తం కూడా పీఎఫ్‌కి కేటాయించుకోవచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్ని వాలంటరీ కంట్రిబ్యూషన్‌గా పిలుస్తారు. అయితే దీన్ని మీరు నేరుగా చేయలేరు. పని చేస్తున్న కంపెనీ నుంచి ప్రతిపాదన వెళ్లాలి. ఇందుకోసం మీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ను సంప్రదించాలి. అదనంగా ఎంత మొత్తం కేటాయించాలనుకున్నారో చెప్పి, దానికి సంబంధించిన పత్రాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అదనంగా కేటాయించడం వల్ల మీ చేతికి వచ్చే జీతం తగ్గినా, ఉన్న ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇది అత్యుత్తమమైనదన్న విషయం మర్చిపోవద్దు. ఇదే కోవకు చెందిన ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే ప్రస్తుతం ఈపీఎఫ్ వడ్డీనే ఆకర్షణీయంగా ఉంది. 15 ఏళ్ల కాలపరిమితి ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 8.7 శాతం, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ (ఎన్ఎస్సీ)పై ఐదేళ్లకు 8.5 శాతం, పదేళ్లకు 8.8 శాతం వడ్డీ వస్తుండగా, బ్యాంకుల ట్యాక్స్ సేవింగ్ డిపాజిట్లపై 8 నుంచి 9 శాతం వరకు వడ్డీ వస్తోంది. కాని బ్యాంకు డిపాజిట్లు, ఎన్ఎస్ఈలపై వచ్చే వడ్డీ... పన్ను భారానికి గురవుతుంది. అదే ఈపీఎఫ్‌లో అయితే అన్ని దశల్లో అంటే ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఏటా వడ్డీ వస్తున్నప్పుడు, వెనక్కి తీసుకున్నప్పుడు కూడా ఎటువంటి పన్ను భారం ఉండదు. ఇక కనీస పీఎఫ్ రూ.1,800! పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని కనీస పీఎఫ్ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం కనీస జీతం రూ.6,500పై పీఎఫ్‌ను లెక్కిస్తుండగా, ఇప్పుడా మొత్తాన్ని రూ.15,000కి పెంచే ప్రతిపాదన చేశారు. ఇది అమల్లోకి వస్తే ఇక నుంచి ప్రతి నెలా కనీస పీఎఫ్ కింద కంపెనీ రూ.1,800, ఉద్యోగి రూ.1,800 చొప్పున రూ.3,600 పీఎఫ్ ఖాతాకి జమ అవుతాయి.